Home Women Health

లైంగిక శక్తికి వయాగ్రా మునక్కాడ

లైంగిక శక్తికి వయాగ్రా మునక్కాడ: వర్ఫాకాలంలో మునగకాడకు డిమాండ్ బాగా ఉంటుంది. ఒక రకమైన చెట్టు. దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలీఫెరా. ఇది విస్తృత ప్రయోజనాలున్న కూరగాయ చెట్టు. ఇవి సన్నగా పొడవుగా సుమారు 10 మీటర్ల ఎత్తు పెరిగి, కాండం నుండి కొమ్మలు వేలాడుతుంటాయి.

మునగకాడ పేరు చెబితే కొత్తగా పెళ్ళయినవారు సిగ్గుపడతారు. పెద్దవారు నవ్వుకుంటారు. మునగకాడను ఇంట్లో ఉపయోగించనివారు ఉండరు. మునగకాడ పులుసు, మునగకాడ పచ్చడి, మునగాకు కూర, మటన్ లో మునగకాడ వేసుకుంటారు. సాధారణంగా మునగకాడకు ఎంతో డిమాండ్ ఉంటుంది. పెళ్ళిళ్ళు, ఇతర ఫంక్షన్లలో మునగకాడ లేకుండా భోజనాలే ఉండవు.

లైంగిక శక్తికి వయాగ్రా మునక్కాడ

వర్ఫాకాలంలో మునగకాడకు డిమాండ్ బాగా ఉంటుంది. ఒక రకమైన చెట్టు. దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలీఫెరా. ఇది విస్తృత ప్రయోజనాలున్న కూరగాయ చెట్టు. ఇవి సన్నగా పొడవుగా సుమారు 10 మీటర్ల ఎత్తు పెరిగి, కాండం నుండి కొమ్మలు వేలాడుతుంటాయి. లైంగిక శక్తిని పెంచి పటుత్వాన్ని, వీర్యకణాలను బాగా యాక్టివ్ గా ఉంచే శక్తి మునగకాడకు ఉంటుంది.

మునగ చెట్లు ముఖ్యంగా ఉష్ణ ప్రాంతాలలో పెరుగుతాయి. ఇవి పొడిగా ఉండే ఇసుక నేలలలో బాగా పెరిగినా, సముద్ర తీర ప్రాంతాలలో కూడా పెరుగుతాయి. ఇవి తొందరగా పెరిగి వర్షాభావాన్ని తట్టుకుంటాయి. వీటినిఆఫ్రికా, దక్షిణ అమెరికా, శ్రీలంక, భారతదేశం, మెక్సికో, మలేషియా మరియు పిలిప్పైన్స్ దేశాలలో పెంచుతున్నారు. ప్రపంచంలో బాగా ఉపయోగపడే చెట్లలో ఇది ఒకటి. దీనిలోని ప్రతిభాగం ఆహారంగాను లేదా ఇతర ప్రయోజనం కలిగివున్నాయి. మునగాకులను పశువులకు దాణాగా ఉపయోగిస్తారు.

విటమిన్ ఎ ఎక్కువగా ఉండే మునగాకును అన్ని వయసులవారు తినవచ్చు. ఆఫ్రికాకు చెందిన సాంప్రదాయ ఆహారంలో మునగాకు ప్రధానమయింది. ఆహార కొరతను తీర్చి గ్రామాభివృద్ధికి తోడ్పడగలదు.మునగ కాయలు చెట్టులో అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగించే భాగం. వీటిని భారతదేశంలో చిక్కుడు మాదిరిగా వండుకుంటారు. కొన్నిసార్లు మునగ గింజల్ని వేపుకొని తింటారు. మునగ పువ్వులు పుట్టగొడుగులాగా రుచికరంగా ఉంటాయి.

పుష్టికరమయిన మునగాకులు
మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం. వీనిలో బీటా కెరోటీన్, విటమిన్ సి, మాంసకృత్తులు, ఇనుము మరియు పొటాషియం ఎక్కువగా కలిగివుంటాయి. ఆకుకూరలు క్రింద వీటిని వివిధ రకాలుగా వండుకుంటారు. ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్ లలోనూ సాస్ ల లోనూ ఉపయోగిస్తారు. మురుంగకాయ్ తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తారు. మునగాకులలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

మునగనూనె వాసనలేకుండా, క్లియర్ గా ఉంటుంది. నూనె తీయగా వచ్చిన పిప్పిని ఎరువుగానూ, నీటిని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చును. దీని చెట్టు బెరడు, వేర్లు, ఆకులు, విత్తనాలు, పువ్వులు అన్నీ చాలా దేశాల సాంప్రదాయక వైద్యవిధానాలలో ఉపయోగంలో ఉన్నాయి. జమైకా లో దీని కాండం నుండి నీలపు వర్ణకం తయారుచేస్తారు. మునగ పువ్వులు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ లో బాగా ఇష్టపడే రుచికరమైన ఆహారం. వీటిని పచ్చి శెనగలు మరియు బంగాళాదుంపలతో కలిపి వండుతారు.

వీటి ఆకులు తొందరగా పెరిగి మనుషులకు మరియు పశువులకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఆకులు మాంసకృత్తులు ఎక్కువగా కలిగివుంటాయి. పశువుల దానాగా ఉపయోగించినప్పుడు సోయా కంటే బలమైనవి మరియు పాల ఉత్పత్తిని పెంచేవిగా గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here