Home Entertainment Cinema

తెలుగు ఇండస్ట్రీలో ద్వితీయ విఘ్నం దాటిన దర్శకులు వీళ్లే..

ఇండస్ట్రీలో సెంటిమెంట్ ని మించిన నమ్మకం మరొకటి ఉండదు. ముఖ్యంగా దర్శకులకు రెండో సినిమా సెంటిమెంట్ ఉంటుంది. తొలి సినిమాతో సంచలన విజయం అందుకున్న తర్వాత అదే ఊపులో రెండో సినిమా చేసి చేతులు కాల్చుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ కొందరు మాత్రమే దిగ్విజయంగా ద్వితీయ విఘ్నం దాటేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కుర్ర దర్శకుడు వెంకీ కుడుముల కూడా వచ్చి చేరిపోయాడు. చలో సినిమాలో సంచలన విజయం అందుకున్న రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు నితిన్ హీరోగా భీష్మ సినిమాను తెరకెక్కించాడు. ఇది కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది.

L/R Boyapati Srinu – Venky Kudumula – SS Rajamouli

దాంతో ద్వితీయ విఘ్నంని దాటిన దర్శకుల జాబితాలో చేరిపోయాడు వెంకీ. ఈయన కంటే ముందు చాలా తక్కువ మంది దర్శకులు తెలుగు ఇండస్ట్రీలో ద్వితీయ విఘ్నం దాటారు. వాళ్లలో అందరికంటే ముందు చెప్పుకోవాల్సిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సంచలన విజయం అందుకున్న తర్వాత సింహాద్రి సినిమాతో తెలుగు సినిమా రికార్డులను తిరగరాశాడు. తొలి సినిమా కంటే రెండో సినిమాతో ఈయన స్థాయి మరింత పెరిగింది. ఇక మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా భద్ర సినిమా తర్వాత తులసి చేసి హిట్ కొట్టాడు. ఈయన కూడా ద్వితీయ విఘ్నం బాగానే దాటేశాడు.

మరో సంచలన దర్శకుడు కొరటాల శివ కూడా రెండో సినిమాను దిగ్విజయంగా పూర్తి చేశాడు. మిర్చి తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కొరటాల. ఇక ఈ మధ్య వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న అనిల్ రావిపూడి కూడా రెండో సినిమాతో విజయం అందుకొన్నాడు. పటాస్ తర్వాత సుప్రీమ్ మంచి విజయం సాధించింది. నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ మజిలీతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో అద్భుతమైన విజయం అందుకని ఎక్స్ ప్రెస్ రాజాతో దాన్ని కంటిన్యూ చేశాడు మేర్లపాక గాంధీ. ఇక ఇప్పుడు ఈ దర్శకుల సరసన చేరిపోయాడు వెంకీ కుడుముల. చలో తర్వాత ఇప్పుడు భీష్మ సినిమాతో ద్వితీయ విఘ్నం దాటేశాడు. ఇప్పుడు మూడో సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here