Home Entertainment Cinema

నాగార్జున కుటుంబంతో వియ్యమొందబోతున్న వెంకటేష్..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఇదే. దానికి తోడు అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ చేస్తున్నారు. నాగార్జున, వెంకటేష్ త్వరలోనే వియ్యంకులు కాబోతున్నారనేది దీని సారాంశం. ఇప్పటికే వీళ్లిద్దరు సొంత బావ బామ్మర్దులు. వెంకటేష్ చెల్లెలు, రామానాయుడు కుమార్తె లక్ష్మిని 1985లో వివాహం చేసుకున్నాడు నాగార్జున. అప్పట్లో దగ్గుబాటి అక్కినేని కుటుంబాలు వియ్యం అందుకోవడంతో అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. కానీ వీళ్ళ ఇద్దరి బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. అనివార్య కారణాలతో లక్ష్మీ, నాగార్జున విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున అమలను పెళ్లి చేసుకుంటే.. లక్ష్మి కూడా మరొకరిని వివాహం చేసుకుంది.

ఇదిలా ఉంటే అప్పుడు తెగిపోయిన బంధం మళ్లీ ఈ రెండు కుటుంబాలను ఇప్పుడు అఖిల్ పెళ్లి రూపంలో కలపబోతున్నారని తెలుస్తోంది. వెంకటేష్ చిన్న కూతురుని నాగార్జున చిన్న కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వరుసకు అల్లుడే కావడంతో సొంత అల్లుడిని చేసుకుంటే తప్పేముంది అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు కొందరు మాత్రం వెంకటేష్, నాగార్జున వియ్యంకులుగా మారడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. దానికి వారు చెబుతున్న కారణం కూడా అప్పట్లో నాగార్జున, ఆయన భార్య విడిపోవడమే.

దగ్గుబాటి అక్కినేని కుటుంబాలకు వివాహ బంధం కలిసిరాలేదని.. దాంతో ఇప్పుడు కూడా అలాగే జరిగితే ఏంటి పరిస్థితి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అసలే అఖిల్ కు ఒకసారి నిశ్చితార్థం జరిగే క్యాన్సిల్ అయింది. మళ్లీ ఇప్పుడు అచ్చిరాని దగ్గుబాటి కుటుంబంతో పెళ్లి బంధం కలుపుకుంటే ఆ తర్వాత అనుకోనిది జరిగితే రెండు కుటుంబాలు మళ్ళీ బాధపడాల్సి వస్తుందని కొందరు ముందుగానే తమ వాదన వినిపిస్తున్నారు. మరికొందరు మాత్రం అప్పుడు విడిపోయారు కాబట్టి ఇప్పుడు అఖిల్ పెళ్లితో మరోసారి కలవాలని ప్రయత్నిస్తున్నారు అంటూ సమర్ధిస్తున్నారు. పైగా ఈ రెండు కుటుంబాలు కలవాలనేది పెద్దాయన రామానాయుడు ఆశ అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై పూర్తి సమాచారం త్వరలోనే రానుంది. ఇదిలా ఉంటే అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here