Home News

కేసీఆర్ విందులో పాల్గొన్న గ్రామస్థులకు అస్వస్థత..అసలేం జరిగిందంటే..!

సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న సిఎం కేసిఆర్ ఆ గ్రామంలో నివస్తిస్తున్న 2500 మందికి ఘనంగా విందు ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ దావత్ లో పాల్గొన్న గ్రామస్థులలో 22 మంది అస్వస్థతకు గురయ్యారు.

వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్ మంది మార్భలంతో ఎంతో ఆర్భాటంగా గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులకు ధావత్ ఇచ్చారు. గ్రామం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 23 రకాల వంటకాలతో భోజనాలు వడ్డించారు. కానీ ఈవిందులో పాల్గొన్న వారిలో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. సీఎం కేసిఆర్ పక్కన కూర్చొని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సభ నుంచి బయటకు వస్తున్న సందర్భంలోనే వాంతులు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆరోజు రాత్రి నుంచి వాంతులు,విరేచానాలతో ఇబ్బందిపడిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు. దాంతో ఆమెను భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఇదే విందులో పాల్గొన్న ఒక బాలిక అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి తర్వాత కోలుకుంది. అలాగే మరో 18 మందికి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడుతుండడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించారు. 2500 మంది దావత్ లో పాల్గొంటే కేవలం 22 మందికి మాత్రమే అస్వస్తతకు గురయ్యారని ఇందులో ఫుడ్ పాయిజన్ అయినట్లు ఆధారాలు లేవని డాక్టర్లు చెబుతున్నారు. విందులో పాల్గొన్న కొందరికి భోజనం పడక ఇలా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here