కార్తీక దీపం సీరియల్ తో ప్రతి ఇంటికి చేరువైన ప్రేమి విశ్వనాథ్ అదేనండి వంటలక్క అరాచకమైన ఫోజు తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సీరియల్‌తోనే కాదు.. ఛాన్స్ దొరికితే బయట కూడా తన చేష్టలతో ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటుంది ప్రేమి విశ్వనాథ్. తాజాగా అలవైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ ని అనుకరిస్తూ సిత్తరాల సిరపడు సాంగ్ స్టిల్స్ కి ఫోజులిచ్చింది వంటలక్క.

లుంగీ కట్టు, పూల చొక్కా, ఒక చేతిలో సిగరెట్, గాల్లో ఎగిరే కోడిపుంజు నోటి నుంచి కోడిపుంజు పై పొగ వదులుతూ.. వంటలక్క ఆరాచకమైన ఫొజుతో అలరిస్తోంది. తన సోదరుడు తీసిన ఆ ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసుకోవడంతో పాటు అల్లు అర్జున్ హ్యాష్‌ట్యాగ్‌ను యాడ్ చేసింది. ఫాలోవర్స్ కోసం.. కింద నో స్మోకింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.