Home News Updates

ప్రతిరోజు 10లక్షల మందికి కరోనా టీకా – ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్

ప్రజారోగ్యం విషయంలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పిన ఆయన కరోనా టీకాలను ప్రతిరోజు 10లక్షల మందికి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

హైదరాబాద్ కేంద్రంగా తయారైన కోవాగ్జిన్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే ప్రవేటు ఆసుపత్రుల సిబ్బందికి టీకా పంపిణీ చేస్తామన్నారు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో తెలంగాణలో 9వేల 800 మంది నిష్ణాతులకు శిక్షణ ఇచ్చి..ఒకే రోజులో 10లక్షల మందికి టీకా ఇచ్చే సత్తా తెలంగాణకు ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు దీర్ఘకాలిక వ్యాదులున్నవారందరికీ వ్యాక్సీన్ ఇస్తామని మంత్రి పేర్కోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here