Home News Updates

యూపీలో బీజేపీకి బిగ్ షాక్..!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో యోగీ సర్కార్ కి ఎదురీత తప్పేలా లేదు. అయోధ్య , మధుర జిల్లాల్లోని స్థానిక సంస్థ ల ఎన్నికలఫలితాలు బీజేపీకి గట్టి షాకిచ్చాయి. ఈఎన్నికల్లో విపక్షాలైన సమాజ్ వాదీ,బహుజన సమాజ్ వాదీ పార్టీలు అధిక శాతం సీట్లు గెల్చుకున్నాయి. చాలా చోట్ల నెక్‌ టు నెక్ పోటీ కనిపించింది.

ప్రధానంగా సీఎం యోగి సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో సమాజ్ వాదీపార్టీ, గట్టి పోటీ ఇచ్చింది.అయోధ్యలో 40 స్థానాలకుగానూ బీజేపీ కేవలం ఆరు స్థానాలు దక్కించుకుంది. సమాజ్ వాదీ పార్టీ 24 చోట్ల, బీఎస్పీ 5 చోట్ల విజయాలు నమోదుచేశాయి. మధురలో33 స్థానాలకు గానూ బీజేపీ 8 స్థానాలను గెల్చుకుంది. ఇక్కడ బీఎస్పీ 13 చోట్ల గెలుపొందింది. ఆర్ఎల్డీ, ఎస్పీ చెరో స్థానంలోవిజయం సాధించాయి. గోరఖ్‌పూర్‌లో60 స్థానాలకు గానూబీజేపీ, ఎస్పీచెరో 20స్థానాలను దక్కించుకున్నాయి. ఆప్, కాంగ్రెస్, నిషద్ పార్టీ చెరో స్థానంలో గెలిచాయి.

రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితులున్నాయంటున్నారు ఎస్పీ నేతలు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. 2017లో మోడీ ప్రభంజనంతో యూపీలోనూ బీజేపీ మంచి మెజార్టీ సాధించింది. అయితే ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ప్రతికూల పవనాలు, వెన్వెంటనే యూపీలో స్థానికఎన్నికల్లోనూ బీజేపీకి గట్టిదెబ్బేతగిలిందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here