Home News

ఉత్తరప్రదేశ్‌ బీజేపీలో ముసలం..మోడీ, యోగి మధ్య వార్‌

ఉత్తరప్రదేశ్‌ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మధ్య…పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మనస్పర్థలు వచ్చినట్లు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. యోగి ఆదిత్య..సీఎం బాధ్యతలు చేపట్టిన కొత్తలో కేంద్రంలోని బీజేపీ బాగా సహకరించింది. ముఖ్యమంత్రిగా పట్టు సాధించిన తర్వాత…ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా వంటి నేతల ఆదేశాలను లెక్కలోకి తీసుకోలేదు. పార్టీ పెద్దలు ఏం చెప్పినా..తనకేం పట్టనట్లు వ్యవహరించారు. ఒకానొక దశలో అగ్రనేతలతో డోంట్ కేర్‌ అన్న రీతిలో ప్రవర్తించారు యోగి ఆదిత్యనాథ్‌. యోగి తీరుపై డిప్యూటీ సీఎంలు దినేశ్ శర్మ, కేశవ ప్రసాద మౌర్యతో పాటు పలువురు మంత్రులు హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారు.

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో…బీజేపీకి ఘోర ఫలితాలు వచ్చాయ్. ప్రధాని మోడీ లోక్‌సభ పరిధిలోని వారణాసి, ముఖ్యమంత్రి యోగి నియోజకవర్గాల్లో…ప్రత్యర్థి పార్టీలు సత్తాచాటాయ్. బీజేపీ రాజకీయ ఎదుగుదలకు కేంద్రమైన అయోధ్యలోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు చేదు అనుభవం మిగిలింది. . వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లకు…ఎస్పీ 24 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ కేవలం 6 సీట్లకే పరిమితమైంది. మిగిలిన 10 సీట్లలో మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీ 5, ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు.

స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత మోడీ, యోగి మధ్య విభేదాలు మరింత ముదిరాయ్. యూపీ సీఎం జన్మదినం సందర్భంగా…పలువురు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రధాని మోడీ మాత్రం తనకేం తెలియదనట్లు బర్త్‌ డే విషస్ చెప్పలేదు, కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ఆ తర్వాత పరిణామాలన్నీ చకచకా మారిపోయాయ్. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..యోగికి చెక్‌ పెట్టాలని భావించారు బీజేపీ అగ్రనేతలు. యూపీ కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న జితిన్‌ ప్రసాదతో సంప్రదింపులు జరిపారు. అవి సక్సెస్‌ కావడంతో అతనికి పార్టీ కండువా కప్పేశారు. జితిన్‌ ప్రసాద కాంగ్రెస్‌ హయాంలో కేంద్ర హోం మంత్రిగా పని చేశారు.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జితిన్‌ ప్రసాదను ప్రధాన తురుపు ముక్కగా వాడుకోవాలని ప్లాన్‌ వేస్తోంది కాషాయ పార్టీ. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌. జితిన్‌ ప్రసాద…బీజేపీ తీర్థం అలా పుచ్చుకున్నారో లేదో..వెంటనే ఢిల్లీలో వాలిపోయారు. హోం మంత్రి అమిత్‌ షాతో రెండుగంటలపాటు భేటీ అయ్యారు. యూపీలో పార్టీ పరిస్థితులను వివరించారు. జితిన్‌ ప్రసాద వల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండబోదని చెప్పినట్లు సమాచారం. ఈరోజు ప్రధాని మోడీని కలవనున్నారు యోగి. మొత్తానికి జితిన్ ప్రసాద ఎంట్రీతో యోగిలో కలవరం మొదలైనట్టే కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here