Home News Updates

మేడారం జాతరలో అర్జున్ ముండా

మేడారం సమ్మక్క – సారాలమ్మ లను దర్శించుకునేందుకు వచ్చిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాకి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి లకు స్వాగతం పలికి, దర్శనం చేయించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, అధికారులు.

మేడారం జాతరను జాతీయ పండగ గా గుర్తించాలని, మేడారం అభివృద్ధికి నిధులు, గురుకులాలు కేటాయించాలని కోరుతూ కేంద్రమంత్రికి వినతి పత్రం ఇచ్చారు.

అనంతరం పోచంపల్లి కండువాలు, శాలువా కప్పి, జ్ఞాపికను అందించి సన్మానం చేశారు.

మేడారం మహా జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా ను కోరిన మంత్రి అల్లోల

వనదేవతలను దర్శించుకున్న అర్జున్ ముండా

స్వాగతం పలికిన స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా, మంత్రులు అల్లోల, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్

మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాను మేడారంలో కలిసి వినతపత్రం అందజేశారు. జాతీయ పండుగగా గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా …కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఇప్పటికైనా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ ఆయనకు స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here