Home Entertainment Cinema

మహేశ్ బాబుని రౌండప్ చేస్తున్న ఆ రెండు గాసిప్స్

సర్కారువారిపాట ఫస్ట్ గ్లింప్స్ ,టీజర్ తీసుకొచ్చి మహేష్ ఎలాగు హల్చల్ చేయడం లేదు.అలాగని కామ్ గా కూర్చున్నాడా అంటే అదీ లేదు. తన ఫ్యాన్స్ పుణ్యమా అంటూ- నిత్యం రూమర్స్ తో రౌండప్ లు కొడుతూనే ఉన్నాడు. తాజాగా మరో రెండు గాసిప్స్ మహేష్ ను ట్రెండ్ లో నిలిచేలా చేస్తున్నాయి.

సంక్రాంతికి సర్కారువారిపాటతో ప్రిన్స్ వస్తున్నాడని అంతా అనుకున్నారు. కట్ చేస్తే సీన్ మారిపోయింది.తాజాగా వాయిదా పడిన షెడ్యూల్ తో ప్రిన్స్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు.దుబాయ్ లో యాక్షన్ షెడ్యూల్ అనంతరం గోవాలో కొన్ని సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించారు.ఈ ముచ్చట ఇలా ఉంటే మహేష్ తో గుణశేఖర్ అనుకుంటున్న ప్రాజెక్ట్ ప్రతాపరుద్రుడు త్వరలో తెరపైకి వెళ్తుందని అంతా భావిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇక రీసెంట్ గా గుణశేఖర్ ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ కూడా మహేష్ తో చేసే సినిమా గురించి హింట్ ఇచ్చినట్లయింది. ఈ రెండు ముచ్చట్లే కాకుండా రాజమౌళి డైరెక్షన్లో మహేష్ చేయబోయే ఫిలిం తాలుకు స్టోరీ ఫస్ట్ వెర్షన్.. పూర్తయిందని త్వరలో దీనిపై అప్ డేట్ రానుందని చెబుతున్నారు.ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ అటువైపుగా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడు.ఈ ఫిలింపై కూడా జక్కన్న టీంనుంచి ఓ అనౌన్స్ మెంట్ వచ్చేస్తే
మహేష్ అభిమానులకు పండగే పండగ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here