Home News

ట్విట్టర్ వేదికగా బీజేపీ నేత విష్ణు పై హీరో సిద్దార్ద్ ఘాటు వ్యాఖ్యలు

బీజేపీ, హీరో సిద్ధార్థ్‌ మధ్య… వివాదం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత విష్ణువర్ధన్‌ విమర్శలపై సిద్ధార్థ్‌ ఘాటుగా స్పందించారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, సిద్దార్థ్‌ సినిమాలకి డబ్బులు ఇస్తున్నాడన్న బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ట్వీట్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు హీరో. దీంతో వీరిద్దరి మధ్య ట్వీట్ల వార్‌ హైలెట్‌ అయిపోయింది.

ఈ మధ్య కాలంలో హీరో సిద్దార్థ్‌ బీజేపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. తన ఫోన్ నెంబరు లీక్ చేశారని తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారని, అత్యాచారం చేస్తామని హెచ్చరిస్తున్నారని బీజేపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ నేతలు కూడా ఆయనను టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా… ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి కూడా… హీరో సిద్దార్థ్‌ కు చురకలంటించారు.

సిద్దార్థ్ సినిమాలకు దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణువర్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని పై హీరో గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. తాను అసలైన భారతీయుడినని, సక్రమంగా పన్ను కడుతున్నానంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాదు వెళ్లి పడుకో విష్ణు..ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ రివర్స్ అటాక్ చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డిని ఏరా..అంటూ కూడా సంభోదించారు హీరో సిద్దార్ధ్. కేంద్రానికి వ్యతిరేకంగా సిద్దార్థ్ చేస్తున్న ట్వీట్లతో బీజేపీ నాయకులు,సిద్ధార్థ్‌ మధ్య మొదలైన వైరం..ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here