Home News

    ఒక్క ట్వీట్‌తో రూ.54వేల కోట్లు ఆవిరి..జర్నలిస్ట్‌ అంత పని చేసిందా…?

    ఒక్క ట్వీట్‌ కొన్ని వేల కోట్లను హాంఫట్‌ చేసింది. ఆదానీ గ్రూప్‌ సందను క్షణాల్లో కరిగించింది. ఆదాని గ్రూప్ సంపద…. 54 వేల కోట్ల ఆవిరి కావటానికి ఒక ప్రముఖ జర్నలిస్టు, మనీ లైఫ్ మేనేజింగ్ ఎడిటర్ సుచేతా దలాల్ ట్వీటే కారణమని సమాచారం. సుచేతా దలాల్‌ జూన్‌ 12న చేసిన ట్విట్‌ ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఓ కంపెనీకి చెందిన షేర్‌ వాల్యూను రిగ్గింగ్‌ చేస్తున్నారని, సెబి ట్రాకింగ్‌ సిస్టమ్‌లతో లభ్యమయ్యే సమాచారంతో.. ఆ కంపెనీ చేసిన కుంభకోణాన్ని వెలికితీసి నిరూపించడం కష్టమంటూ సూచేతా ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌ అదానీ గ్రూప్‌పై గురిపెట్టిందే అంటూ నెటిజన్లు రీట్వీట్‌ చేశారు. ఇంకేముంది అదాని షేర్లుడమాల్‌ అనడం..54 కోట్ల భారీ నష్టం రావడం జరిగిపోయింది.

    సుచేతా దలాల్‌… 1992లో హర్షద్‌ మెహతా కుంభకోణాన్ని కూడా బయట ప్రపంచానికి వెల్లడించింది. ఆ స్కామ్‌ అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఇదిలా ఉంటే… సుచేతా దలాల్‌ ట్వీట్ సోమవారం ట్రెండిగ్‌లో ఉంది. ఎలన్‌ మస్క్‌… ఒక్క ట్విట్‌తో క్రిప్టోకరెన్సీ వాల్యూను పెంచగలిగితే… సుచేతా దలాల్‌ కంపెనీ పేరు బయటకు చెప్పకుండానే చేసిన ట్వీట్‌కు..అదానీ కంపెనీ షేర్‌ విలువ భారీగా పడిపోయిందని నెజిటన్లు అంటున్నారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here