Home News Updates

టీవీ 5 నుంచి టాప్ బాస్ నిష్క్రమణ …. అందుకేనా?

అసలు టీవీ 5 లో ఏం జరుగుతోంది … టాప్ పోసిషన్ కి వచ్చిన వాళ్లంతా ఎందుకు వెళ్లిపోతున్నారు . తొలి నుంచి ఇదే జరుగుతోంది ..శివరాం ప్రసాద్., ఐ ఎస్ ., మొదలుకుని నిన్నటి దినేష్ ఆకుల వరకు … ఎందుకు టాప్ బ్రాస్ లోని వాళ్లే వెళ్లిపోతున్నారు అనే అనుమానం కలగడం సహజం …ఇది యాజమాన్యం ఎత్తుగడేనా … ప్లానా .. లేకుంటే.. అక్కడ వున్న కొందరి మధ్య నలగలేక పారిపోతున్నారా .. అనే అనుమానాలు కలుగు తున్నాయి.

దినేష్ ఆకుల మంచి విజన్ వున్న జర్నలిస్ట్ .. టీవీ 9 సక్సెస్ కు కారకుడు. అలాగే ఎక్సప్రెస్స్ టి వి ని కూడా చక్కగా నడిపించిన వ్యక్తి. ఆ తర్వాత టీవీ 5 లో చేరాడు. కొన్ని మార్పులు తీసుకువచ్చాడు. అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు .. ఇలా ఎందుకు జరుగుతోంది… అక్కడ ఇప్పటికే వేళ్లూని ఉన్న వాళ్ళ మధ్య రాణించడం కష్టమని భావించారా.. లేక ఇంటర్నల్ రాజకీయాలకు విసిగి పోయారా … లేదా ఇటీవల ఎంటర్ అయి తాను చేసేదే సంచలనం., తానే గొప్ప అనే వ్యక్తి వల్ల ఇక్కట్లు పడ్డారా … అన్నది తెలియడం లేదు ..

ఇక మరో విషయం చూస్తే టీవీ 5 పూర్తిగా ఒక పార్టీ ని నెత్తిన పెట్టుకున్న పరిస్థితులలో రాజకీయ ఒత్తిళ్లు ఉండడం సహజం. ఆంధ్ర ప్రదేశ్ లో ఆ ఛానల్ చాలా చోట్ల రావడం లేదు. ఈ పరిస్థితులలో ఒక ముద్ర పడడం నిఖార్సైన జర్నలిస్ట్ కు కాస్త ఇబ్బందే … మరి ఇది కూడా కారణం కావచ్చు. ఏది ఏమైతే ఏం టీవీ 5 దారి ఏటో కాలమే నిర్ణయించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here