Home News

బ్రేకింగ్: టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా ఏడుగురు సభ్యుల నియామకం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ పదవికి ఎట్టకేలకు మోక్షం లభించింది. గత రెండు సంవత్సరాలుగా పాలకవర్గం లేకుండా కేవలం ఇద్దరు సభ్యులతో టీఎస్పీఎస్సీని సాగదీసింది తెలంగాణ సర్కార్. తాజాగా ఉద్యోగాల నియామకాల వేళ కూడా టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో హైకోర్టు సీరియస్ అయింది. చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ బి. జనార్దన్‌ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్నారు. గతంలో జీహెచ్ఎంసీ కమీషనర్ గా కూడా పని చేశారు.

చైర్మన్ సహా ఏడుగురు సభ్యులను నియమిస్తూ గవర్నర్ కి ఫైల్ పంపింది సీఎం కార్యాలయం. గవర్నర్ తమిళిసై వెంటనే ఆమోదం తెలపడంతో జనార్దన్‌రెడ్డితోపాటు ఏడుగురు సభ్యులను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సభ్యులుగా రమావత్‌ ధన్‌సింగ్‌, కోట్ల అరుణకుమారి, లింగారెడ్డి, ఆర్‌.సత్యనారాయణ, ఆరవెల్లి చంద్రశేఖర్‌రావు, సుమిత్ర ఆనంద్‌తో పాటు కారం రవీందర్‌రెడ్డిని టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here