Home News Stories

టీఆర్ఎస్ పెండింగ్‌ అభ్యర్థుల లిస్ట్ రెడీ… ఆ 14 మంది వీరే….

ముందస్తు ఎన్నికల కాక టీఆర్ఎస్ లో వేడి పుట్టిస్తుంది. జెట్ స్పీడ్లో 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన గులాబీ బాస్ 14 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. ఈ స్థానాల్లో మెరుగైన అభ్యర్ధులను బరిలో దించాలని భావిస్తున్న కేసీఆర్ ఈ స్థానాల పై కూడా క్లారిటి కి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ 24న మొత్తం పెండింగ్‌ అభ్యర్ధుల జాబితాను ఒకేసారి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు గులాబీ పార్టీ అధినేత….

తొలివిడత 105 స్థానాల్లోనూ సర్వే నిర్వహించి అభ్యర్ధులను ప్రకటించామన్న కారు పార్టీ. మరో విడత ఈ 14 స్థానాల పై ఫ్లాష్‌సర్వే నిర్వహించినట్లు టాక్. ఈ సర్వే నివేదిక అందడంతో ఈ స్థానాలపై సీఎం దృష్టిపెట్టారు. పెండింగ్‌లో ఉన్న ఈ 14 స్థానాలకు పోటీ అనూహ్యంగా ఉండగా, సర్వేల సమాచారం.. తన ఆలోచనలు, భవిష్యత్‌లో పార్టీ ప్రయోజనాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధులపై అధినేత ఓ నిర్ణయానికొచ్చినట్లు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో నలుగురు ఐదుగురు బలమైన అభ్యర్ధులు పోటీ పడుతుండగా, కొందరు నేతలను పిలిచి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.

వరంగల్ తూర్పు,హుజూర్ నగర్ స్థానల పై కొంత డైలమా కొనసాగుతుండగా మిగిలిన వాటి పై క్లార్టిటికొచ్చేశారు.వరంగల్‌ తూర్పుకు సంభందించి కేసీఆర్‌ శిబిరం నుండి సంకేతాలు వెళ్ళిన నేపథ్యంలో కొండావర్గీయుల్లో డైలమా కొనసాగుతుండగా, పార్టీ కట్టుదాటిన వారికి టికెట్లు ఇవ్వమని కేటీఆర్‌ మరోమారు కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో వారికి టికెట్‌ కష్టమేనన్న ప్రచారం సాగుతోంది. ఈ స్థానం బీసీలకే కేటాయించాలనుకుంటే మాజీ మంత్రి బసవరాజు సారయ్యకే చాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మల్కజ్ గిరిలో ప్రస్థుత ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు శాంతికే టిక్కెట్ ఇవ్వోచ్చు. మైనంపల్లి హనుమంతరావు టిక్కెట్ కోసం పట్టుబట్టడంతో ఇది పెండింగ్ లో ఉంది.

ఇక సిటీ నడిబొడ్డులో ఉన్న ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కూతురు విజయారెడ్డి, మన్నే గోవర్ధన్ రెడ్డి, దానం పోటిపడగా దానం నాగేందర్ కే టిక్కెట్ ఖారారయినట్లు సమాచారం. ముషీరాబాద్ నుంచి తన అల్లుడు శ్రీనివాసరెడ్డి కోసం హోంమంత్రి నాయిని పట్టుబట్టగా ఇక్కడ ముఠా గోపాల్ పట్ల సీఎం సానుకూలంగా ఉన్నారు. హోంమంత్రి నాయిని ని మంత్రి హరీశ్,కేటీఆర్ లు బుజ్జగించి ఫ్యూచర్ లో తన అల్లుడికి తగిన హోదా ఇస్తామని హామి ఇచ్చారు. అంబర్ పేట నుంచి కాలేరు వెంకటేశ్ , జహీరాబాద్‌ నుంచి ఎర్రోళ్ళ శ్రీనివాస్ ను బరిలో దించనున్నారని సమాచారం.

చొప్పదండి అభ్యర్ధిగా తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగెశోభనే మళ్ళీ ప్రకటించే అవకాశం ఉంది. మొదట మార్చలానుకున్న జిల్లాలో సిట్టింగ్ లందరికి సీట్లు ఇచ్చి ఒక మహిళకు టికెట్‌ ఆపడం ఎందుకన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తుంది. అభ్యర్ధుల ప్రకటన తర్వాత కూడా శోభ పార్టీ కార్యక్రమాల్లో ఎప్పటిలాగే అసంతృప్తి లేకుండా పాల్గొంటుండడంతో ఆమెకు అది పాజిటివ్ గా మారింది. మేడ్చల్ లో ఎంపీ మల్లారెడ్డినే బరిలో దింపే చాన్స్ ఎక్కువగా ఉంది. మరో ఇద్దరి మధ్య గ్రుప్ వార్ నడుస్తుండటంతో అక్కడ మల్లారెడ్డి సేఫ్ అన్న ఆలోచనలో అధిష్టానం డిసైడైంది. గోషామహల్ ను ముఖేశ్ కోసం అంటిపెట్టిన ఆయన ఇంకా నిర్ణయించుకోకపోవడతో నియోజకవర్గ ఇంచార్గ్ ప్రేమ్ సింగ్ కే అవకాశం దక్కనుంది. అయితే అధినేత మనసులో ఏముందో జాబితా బయటకు వస్తే కానీ తెలీదని సీఎం సన్నిహితుల ఇన్ సైడ్ టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here