Home News

టిఆర్ఎస్ మిషన్ హుజురాబాద్..ఈటల పై ముప్పేట దాడి..!

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. దీంతో మిషన్‌ హుజురాబాద్‌ మొదలెట్టింది టీఆర్‌ఎస్‌. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక..ఒక్క దుబ్బాక మినహా నాలుగు ఉప ఎన్నికల్లో గెలిచింది. ప్రతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను గెలిచి తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు హుజురాబాద్‌ ఉప ఎన్నికపై దృష్టి పెట్టిన టిఆర్ఎస్ ఇంచార్జిలను నియమించి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది.

ఇప్పటి వరకు ప్రతి ఉప ఎన్నికలో ఒక్కో వ్యూహంతో ముందుకు సాగింది టిఆర్ఎస్.. హుజురాబాద్ ఉప ఎన్నిక అంశంలో కూడా ఎన్నికల వ్యూహాన్ని రూపొందించే పనిలో ఉంది. నియోజకవర్గంపై నజర్ పెట్టిన పార్టీ ముఖ్యనేతలు..ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు. ఇంచార్జిలు తమకు కేటాయించిన మండలాల్లో ఇప్పటికే పని మొదలుపెట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఏ అంశాలను జనాల్లోకి తీసుకెళ్లాలన్న విషయమై టిఆర్ఎస్ నేతలు సమాలోచనలు చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతగా ఈటను బీజేపి ప్రొజెక్ట్ చేస్తే అందుకు తగ్గ వ్యూహంతో ముందుకెళ్తుంది టీఆర్ఎస్. హరీశ్ రావు,నారదాసు లక్ష్మణ్ రావు,కెప్టెన్ లక్ష్మీకాంతరావు,మాజీ ఎంపీ వినోద్ ఇలా ఉద్యం నేతలను ముందుంచి పోరాడనుంది. ఈటల బర్తరఫ్‌ తర్వాత హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌తో వరుస భేటీ అవుతూ హుజూరాబాద్‌లో పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

ఈటల భూ ఆక్రమణలను ప్రధానంగా ప్రస్తావించాలని టిఆర్ఎస్ నేతల ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ విషయంలో కచ్చితంగా ఈటల ఆత్మ రక్షణలో పడతారని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావించాలనుకుంటోంది టీఆర్‌ఎస్‌. ఇటు ఈటల రాజేందర్ లేవనెత్తే అంశాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదన్న భావనలో టిఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పని మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ముఖ్యనేతలు నియోజకవర్గంలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here