మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీ కమిషన్ మాజీ సభ్యులు వకుళాభరణం క్రిష్ణమోహన్. బీజేపీలో చేరిక నుంచే ఈటలకు అవమానాలు మొదలయ్యాయన్నారు. ఏ ఆత్మగౌరవ నినాదంతో ఈటల బీజేపీలో చేరారో చేరిక రోజే అది కోల్పోయారన్నారు. అక్రమాలకు పాల్పడినందుకు చర్యలు తీసుకుంటే బిసీలకు ద్రోహం చేసినట్టా అన్నారు.
కేసీఆర్ వెంటే ఉంటామని చెప్తున్న వారిని అమ్ముడు పోయారనడం సరి కాదు అన్నారు. హుజురాబాద్, కమలాపూర్ ప్రాంత ప్రజల వల్లే ఈటల ఈ స్థాయికి ఎదిగారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.