Home News Updates

ఈటలకు షాక్ ఇచ్చిన మరో కీలక నేత

హుజూరాబాద్ రాజ‌కీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ మరోవైపు ఈటల వర్గం ఎత్తులకు పై ఎత్తులు వేయడంతో ఇక్కడి రాజకీయం రసవత్తరంగా మారుతుంది. కొంద‌రు ఈట‌ల వెంట ఉంటే.. మ‌రి కొంద‌రు టీఆర్ ఎస్‌కు జై కొడుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ గ్రూప్ నుంచి ఎటు ఫిరాయిస్తారో నేతలకు అర్ధంకాక తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే జ‌మ్మికుంట మున్సిప‌ల్ చైర్మ‌న్ త‌క్కెళ్ల‌ప‌ల్లి రాజేశ్వ‌ర్‌రావు టీఆర్ ఎస్‌కు జై కొడితే.. వైస్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ఈటలకు మద్దతిచ్చారు.

మంత్రి గంగుల కమలాకర్ తన సొంత టిమ్ తో హుజూరాబాద్ లో మంత్రాంగం నడుపుతున్నారు. తాజాగా ఈటలకు ముఖ్య అనుచరుడైన బండ శ్రీనివాస్ ని ఈటల వర్గం నుంచి టీఆర్ఎస్ లోకి లాగారు. ఆయన మొదట నుంచి ఈటలకు ఎంతో న‌మ్మ‌క‌స్తుడిగా ఉండి పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా పని చేస్తున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్ రాధిక సైతం ఈటల వెంట వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించిన సమయంలో ఈ నేతలంతా ఈటలకు బాసటగా నిలిచారు. ఇప్పుడు ఒక్కోక్కరుగా షాకిస్తున్నారు. హుజూరాబాద్ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here