Home News Politics

గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలపై రంగంలోకి దిగిన మంత్రులు! తలసాని టెలికాన్ఫరెన్స్

గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, నూరు శాతం నమోదు జరిగేలా కృషి చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి GHMC పరిధిలోని మంత్రులు, MLC లు, MLA లు, కార్పొరేటర్ లతో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు జరగనున్న నేపద్యంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం ఈ నెల 1 వ తేదీన ప్రారంభమైందని, నవంబర్ 6 వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి చెప్పారు. MLC లు, mla లు, కార్పొరేటర్ లు పార్టీ శ్రేణులు సమన్వయంతో వ్యవహరించి మీ మీ ప్రాంతాలలో ఉన్న గ్రాడ్యుయేట్ లను గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునే విధంగా చూడాలని చెప్పారు. పలు అపార్ట్ మెంట్లు, బస్తీలు, కాలనీలలో ఉన్న గ్రాడ్యుయేట్ లను అసోసియేషన్ ల సహకారం తో గుర్తించాలని అన్నారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం సమర్పించే దరఖాస్తులలో సమాచారం పూర్తిస్థాయి లో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. దరఖాస్తులను సమీపంలోని GHMC కార్యాలయంలో సమర్పించాలని, లేదంటే ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని అన్నారు. ఏ రోజుకు ఆ రోజు ఓటరు నమోదు సమాచారాన్ని పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని అన్నారు. ఈ సందర్బంగా డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సరైన అవగాహన లేని కారణంగా గతంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం పూర్తి స్థాయిలో జరగలేదని, అనేక మంది ఓటరుగా నమోదు చేయిన్చుకోలేదని అన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధమైన కార్యక్రమం నిర్వహించలేదని చెప్పారు. MLC ప్రభాకర్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటరు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అసంపూర్తిగా ఉంటే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దరఖాస్తులను GHMC కార్యాలయంలో సమర్పించినప్పుడు ఎక్ నాలెడ్జ్ మెంట్ (రిసిప్ట్) ను తప్పని సరిగా పొందాలని పేర్కొన్నారు. MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ప్రకాష్ గౌడ్ లు మాట్లాడుతూ బస్తీలు, కాలనీలు, అపార్ట్ మెంట్ లలో ఇంటింటికి తిరుగుతూ గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరం పరిధిలో ఎన్నో సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న అనేక మంది యాజమాన్యపు హక్కు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే వారి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మీ మీ పరిధిలో అలాంటి సమస్యలు ఉన్న వారి సామచారం సేకరించాలని అందజేయాలని ఆయన సూచించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఇంకా పలువురు mla లు, mlc లు, కార్పొరేటర్లు మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here