Home News

టీఆర్ఎస్ లో మరో ఎమ్మెల్యేకి కౌంట్ డౌన్ స్టార్ట్…!

టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి ఉన్న సీనియర్..తొలిసారి ఎమ్మెల్యే కేసీఆర్ కి సన్నిహితం కానీ ఆయన ఫేట్ బాగా లేనట్లుంది. ఇప్పుడు పార్టీలో ఆ నేతకు కౌంట్ డౌన్ స్టార్టయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన ఎమ్మెల్యేకు పార్టీ పెద్దలకు మధ్య భారీగా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నర్సంపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు టీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఆయన గులాబీ శిబిరంలోనే ఉన్నారు. ఉద్యమ సమయంలో వరంగల్‌జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న నేతల్లో ఒకరు. కేసీఆర్ తో సన్నిహితం అయిన పెద్దికి ఇప్పుడు పార్టీలో పెద్ద కష్టమే వచ్చినట్లు తెలుస్తుంది.

2014లో మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో.. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అయ్యారు సుదర్శన్‌రెడ్డి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి నర్సంపేట నుంచి బరిలో దిగిన సుదర్శన్‌రెడ్డి.. గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పార్టీ కార్యక్రమాలు.. అధికారిక ప్రోగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొంటున్నా.. ఇటీవల వరంగల్‌లో జరిగిన ఒక ఘటనతో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు ఈ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన సందర్భంగా జరిగిన ఘటన కావడంతో అంతా ఆయనవైపు చూశారు. సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటనలో భద్రతా కారణాల రీత్యా చాలా మంది ప్రముఖల వాహనాలను దూరంగానే ఆపేశారు పోలీసులు. ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి కారును సైతం పోలీసులు ఆపారు. దీంతో కారు దిగి నడుచుకుంటూ వెళ్లారాయన.

అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్‌రెడ్డి కారు ఆపడంతో ఆ సమయంలో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయ్యింది. పోస్టులు హోరెత్తాయి. సీఎం పర్యటనలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు ఘోర అవమానం అన్నట్టుగా సోషల్‌ మీడియాలో పోస్టులు వచ్చాయి. అవి కాస్తా రచ్చకు దారితీశాయి. చివరకు తనకెలాంటి అవమానం జరగలేదని..పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఆ ఘటన అలా ఉంటే.. టీఆర్‌ఎస్‌ పెద్దలను కలిసేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారట. అయితే ఆయనకు అపాయింట్‌మెంట్‌ రాలేదన్న ప్రచారం మొదలైంది. ఇటీవల వరంగల్‌లో జరిగిన పరిణామాల వల్లే ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందా అన్న చర్చ స్టార్టయింది. అంతేకాదు.. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మనస్తాపం చెందారట. దానిపైనే ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here