Home Entertainment Cinema

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ అదిరిపోయే టైటిల్..

అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఈయన గత సినిమాలు అజ్ఞాతవాసి డిజాస్టర్ అయింది.. అరవింద సమేత అబౌ యావరేజ్ గా నిలిచింది. దాంతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన పరిస్థితుల్లో బన్నీ సినిమాతో అది పూర్తి చేసాడు త్రివిక్రమ్. ఇక ఈ దర్శకుడికి ఓ సెంటిమెంట్ బలంగా ఉంది. తన సినిమా టైటిల్స్ లో అ అనేది వచ్చేలా చూసుకుంటాడు మాటల మాంత్రికుడు. మస్ట్ అని కాదు కానీ వస్తే హ్యాపీ అంటాడు ఈయన.

అప్పట్లో విశ్వనాథ్ తన సినిమాలకు ఎస్ అనే అక్షరంతోనే టైటిల్స్ పెట్టేవాడు.. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అ.. ను నమ్ముకుంటున్నాడు. ఇప్పటికే ఈయన కెరీర్లో అతడు, అత్తారింటికి దారేది, అ..ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత.. ఈ మధ్యే అల వైకుంఠపురములో అ అనే అక్షరంతోనే మొదలయ్యాయి. అందులో అజ్ఞాతవాసి మాత్రమే నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత తర్వాత మరో సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్. దీనికి కూడా అ అనే అక్షరంతోనే టైటిల్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. దీనికి ‘అయిననూ పోయిరావలె.. హస్తినకు’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడని ప్రచారం జరుగుతుంది. రష్మిక మందన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా నటించబోతుంది.

జులై నుంచి షూటింగ్ మొదలు పెట్టి సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. మార్చ్ నాటికి రాజమౌళి నుంచి ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు ఈయన.