Home Videos

టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి..ముహుర్తం పై క్లారిటీ

తెలంగాణ కాంగ్రెస్ కొత్త చీఫ్ ఎంపిక కు ముహూర్తం బాగోలే దొ…కాంగ్రెస్ టైం బాగొలేదో కానీ పిసిసి నియామకం..వ్యవహరం పెద్ద మిస్టరీగా మారింది. అప్పుడే అయిపోతుంది అన్నట్టు వ్యవహరం నడిపారు… ఇప్పటి వరకు దిక్కు లేదు. సాగర్ ఎన్నికలు అన్నారు అవి ముగిసి కూడా 15రోజులు గడిసింది. ఇప్పుడు మళ్ళీ తెరపైకి రావడం టీపీసీసీ చీఫ్ రేవంత్ కి అవకాశం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

పిసిసి చీఫ్ రేసులో ఇప్పటికే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి… రేవంత్ రెడ్డి లు ఉన్నారు. ఆఖరి వరకు కూడా ఇద్దరి ప్రయత్నం చేశారు. వీరి మద్దతు దారులు మాత్రం ఏదో ఒక రూపం లో ఇష్యూ నీ లైవ్ లో ఉంచుతున్నారు. ఇప్పటికే రేవంత్ పార్టీలో చాలా మంది సీనియర్ల ను తన ఖాతాలో వేసుకున్నారు. కోమటిరెడ్డి… తన సీనియారిటీ నీ నమ్ముకున్నారు. జీవన్ రెడ్డి మేడం నాకు అప్రూవల్ చేసింది కదా… అనే ఆశతోనే ఉన్నారు. ఇలా కాంగ్రెస్ నాయకులు ఆశల పల్లకిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here