Home News Stories

ఎక్క‌డి హీరోల‌క్క‌డే గ‌ప్‌చుప్‌..

తిన్నామా..ప‌డుకున్నామా..తెల్లారిందా..


టాలీవుడ్ భార‌తంలో శ్రీరెడ్డి మొద‌లుపెట్టిన వివ‌స్త్ర‌ప‌ర్వంతో ఇండ‌స్ట్రీ షేకైపోయింది. ఫిల్మ్‌న‌గ‌ర్ కేంద్రంగా న‌మోదైన భూకంపంతో పెద్దోళ్ల బిల్డింగులు బీట‌లువార‌తాయేమోన‌ని భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ప్ర‌స్తుతానికి ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గినా పూర్తిగా సైడైపోతే బాగోద‌ని అప్పుడ‌ప్పుడై రాళ్లు విసురుతూనే ఉంది అంద‌రి బతుకులూ బ‌జారుకు లాగుతానంటున్న శ్రీరెడ్డి. శ్రీరెడ్డి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని గోకేదాకా ఇండ‌స్ట్రీలో పెద్ద‌లెవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఎప్పుడైతే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌మీద నోరుపారేసుకుని..చివ‌రికి ఇంట్లో ఉండే ఆయ‌న త‌ల్లిని కూడా శ్రీరెడ్డి తిట్టేసిందో అప్పుడే అంద‌రికీ పౌరుషం పొడుచుకొచ్చేసింది. జీవితారాజ‌శేఖ‌ర్ లైన్‌లోకొస్తేగానీ తెలుగుసిన్మా ప‌రిశ్ర‌మ పెద్దలు పెద‌వులు క‌ద‌ప‌లేదు.

ఫిల్మ్‌ఛాంబ‌ర్‌లో మెగాఫ్యామిలీ హైడ్రామా న‌డిపింది. 24గంట‌ల్లో శ్రీరెడ్డి వ్య‌వ‌హారాన్ని ఇండస్ట్రీపెద్ద‌లు తేల్చాల‌ని అల్టిమేటం ఇచ్చిన ప‌వ‌ర్‌స్టార్ త‌ర్వాత ఇష్యూని ఎటెటో తీసుసుకెళ్లిపోయాడు. తిట్టించింది తానేన‌ని లీకైపోవ‌టంతో సారీ బాసూ అంటూ వ‌ర్మ లెంప‌లేసుకున్నాడు. జ‌న‌సేన‌తో రాజ‌కీయం ఒంట‌బ‌ట్టించుకున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ ఇష్యూని తెలివిగా పాలిటిక్స్ వైపు మ‌ళ్లించాడు. స‌రే…ప‌వ‌న్ ఎజెండా ఎలాగ‌న్నా ఉండ‌నీ…శ్రీరెడ్డి మాటున ఇండ‌స్ట్రీమీద జ‌రుగుతున్న ఎటాక్‌నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలి, అప‌నింద‌ల్ని ఎలా తిప్పికొట్టాల‌న్న‌దానిపై ప‌రిశ్ర‌మ పెద్ద‌లంతా వేసిన మీటింగ్ త‌ర్వాత ఏదో జ‌రిగిపోతుంద‌నుకుంటే ఎక్క‌డి పెద్ద‌ల‌క్క‌డే గ‌ప్‌చుప్ అయిపోయారు.

బ‌య‌ట‌ప‌డ‌దుగానీ సిన్మా ఇండ‌స్ట్రీలో ఉన్న‌న్ని గ్రూపు రాజ‌కీయాలు పాలిటిక్స్‌లో కూడా క‌నిపించ‌వు. ఎవ‌రి జెండా వారిది. ఎవ‌రి ఎజెండా వారికుంటుంది. ఎదురుప‌డ్డ‌ప్పుడు న‌వ్వుతూ కావులించుకుంటార‌న్న‌మాటేగానీ ఎవ‌రి క‌డుపులో ఎన్నెన్ని క‌త్తులు దాచుకున్నారో అర్ధంకాదు. ఎంత‌యినా న‌టులు క‌దా! హీరోలు, సినీపెద్ద‌ల మీటింగ్‌కి అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ వేదికైంది. ఆ మీటింగ్ త‌ర్వాత కూడా వ‌ర్మ‌సంగ‌తేం చేయాలో, శ్రీరెడ్డిని ఎలా క‌ట్ట‌డిచేయాలో ఏ నిర్ణ‌య‌మూ జ‌ర‌గలేదు. ఆరోజు మీటింగ్‌లో మాత్రం పెద్ద డ్రామానే న‌డిచింద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. విష‌యం శ్రీరెడ్డినుంచి సిన్మా గాపిక్స్ వండివార్చే వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛాన‌ళ్ల‌వైపు మ‌ళ్లింది. శ్రీరెడ్డితో చ‌ర్చావేదిక‌లు పెట్టి ట్ర‌క్కుల‌కు ట్ర‌క్కులు ఇండ‌స్ట్రీమీద దుమ్మెత్తిపోసిన మీడియాపైనే రుస‌రుస‌లాడారు.

విష‌య‌మేంటంటే ఇండ‌స్ట్రీ క‌ళంకితం (ఇప్పుడు ప‌విత్రంగానే ఉందా?) కాకుండా చూసుకునే విష‌యంలో అంతా ఒక్క‌మాట‌మీదుంటర‌నుకుంటే ఎవ‌రి లెక్క‌లు వాళ్ల‌వి. ఎలాగూ మెగా ఫ్యామిలీకి బుర‌దంటింది (అదేలెండి..శ్రీరెడ్డి అంటించిందే)..ఆ ఎక్కుపెట్టే తుపాకీ ఏదో మెగా కాంపౌండ్ భుజాల‌మీద పెడ‌దామ‌న్న ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఎవ‌రు చేశారంటే…ఇంకెవ‌రు ఆ మీటింగ్‌కి ఆతిథ్య‌మిచ్చిన అక్కినేనివారే. న్యూస్ ఛాన‌ళ్ల‌మీద ఆ మీటింగ్‌లో ఎక్కువ‌గా ఎగిరెగిరి ప‌డింది సుప్రియ‌నే(పేరెక్క‌డో విన్న‌ట్లుంది క‌దా. ఆ..ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో అప్పుడెప్పుడో ఓ సిన్మాచేసిందే.. నాగార్జున అక్క‌కూతురు. త‌నే). ఆమెకి తందానా అన్న‌దేమో ఓ లేడీ డైరెక్ట‌ర్‌.

మీడియా నిషేధంపై ఇంకా నిర్ణయం లేదు, ప్రకటన లేదు కానీ ఇప్పటికే దీనిపై రకరకాల కథనాలు వచ్చేసాయి. ఈ కథనాల్లో చాలా వరకు దీని వెనుక మెగా క్యాంప్ వుందని, దాని ప్రోద్బలమే ఎక్కువగా వుందని, అలాగే అల్లు అరవింద్ దీనికి చొరవ చూపిస్తున్నారని అనిపించేలా వున్నాయి. అక్కినేని కాంపౌండ్‌, సురేష్‌బాబు అంతా ఒకే తాను ముక్క‌లే. ఇండ‌స్ట్రీలో వాళ్ల‌కో రేంజ్ ఉంది. త‌మ అభిప్రాయాలు, ఆలోచ‌న‌ల్ని ఓపెన్‌గా బ‌య‌టికొచ్చి చెప్పొచ్చు. వాటిని అమ‌లుచేసేలా ఇండ‌స్ట్రీమీద ఒత్తిడి తీసుకు రావ‌చ్చు. అదొదిలేసి ఈ సీక్రెట్ మీటింగ్ పెట్ట‌నేల? మెగాకాంపౌండ్ భుజాలు విశాలంగా ఉన్నాయ‌ని దానిమీద తుపాకులు పెట్టి త‌మ‌కు గిట్ట‌నివారిపై గురిపెట్టాల‌నుకోవ‌డ‌మేల‌?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here