Home Entertainment

షాకింగ్: కరోనా తో టాలీవుడ్ లో మరో దర్శకుడు మృతి

కరోనా సెకండ్‌ వేవ్‌ చిత్రపరిశ్రమలో తీరని శోకం మిగులుస్తుంది. ఇటీవలే జర్నలిస్ట్‌ టీఎన్‌ఆర్‌,దర్శకుడు అక్కినేని వినయ్‌ కుమార్‌, సంగీత దర్శకుడు చంద్రశేఖర్‌ ఇలా పలువురినీ కరోనా బలి తీసుకుంది. ఈ వరుస విషాదాల నుంచి కోలుకోకముందే మరో టాలీవుడ్ దర్శకుడు కరోనాకి బలయ్యారు. దర్శకుడు,రైటర గా పనిచేస్తున్న నంద్యాల రవి కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 42..కోవిడ్‌ బారిన పడి కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

నేనూ సీతామహాలక్ష్మీ, పందెం, అసాధ్యుడు వంటి చిత్రాలకు రైటర్ గా పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారు రవి. ఆ తర్వాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాతో దర్శకుడిగా అవకాశం లభించింది. ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత విజయ్‌ కుమార్‌ కొండా తీసిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’తో మరోసారి రచయితగా మారాడు. కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయనకు హీరో కమెడియన్ సప్తగిరి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశాడు. కరోనా క్రైసిస్‌ ఛారిటీ నుంచి కూడా కొంత సహాయం అందినట్లు సమాచారం. ఆయన మరణం పట్ల పలువురు ఇండస్ట్రీ ప్రములు సంతాపం ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here