Home Entertainment Cinema

ఓటీటీలో దుమ్మురేపుతున్న టాలీవుడ్ బ్యూటీలు

సౌత్ హీరోల సంగతేమో గాని హీరోయిన్లంతా ఓటీటీలతో కాలక్షేపం చేసేస్తున్నారు.సినిమాలకొచ్చే రెమ్యునరేషన్ ఇక్కడ కూడా వస్తూ ఉండడంతో అస్సలు తగ్గడం లేదు.లీడింగ్ బ్యూటీస్ కూడా ఓటీటీలకు క్యూ కట్టడంతో హాట్ డీల్స్ జరుగుతున్నాయి.

సినిమాల ప్రదర్శన,షూటింగ్ లు నిలిచిపోవడంతో ఎంటర్ టైన్మెంట్ లవర్స్ వినోదరంగంలో ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు.ఎప్పటిలాగానే వారికి ఓటీటీలు కనిపించాయి.ఈ రంగానికి మళ్లీ మంచి రోజులు
రావడంతో హాట్ డీల్స్ జరుగుతున్నాయి.దానిలో భాగంగా పలువురు హీరోయిన్లు ఓటీటీలకు సైన్ చేస్తున్నారు.కుదిరితే సినిమా లేదంటే వెబ్ సిరీస్..అదీ కుదరకపోతే స్సెషల్ టాక్ షో లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. సమంతా లాంటి హీరోయిన్లు ఈవిషయంలో ముందంజలో ఉన్నారు.

రీసెంట్ గా కోలీవుడ్ సీనియర్ గాళ్స్ అయినటువంటి నయనతార,త్రిషలు ఈ విషయంలో కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు.వీరు నటించిన పలు ప్రెస్టీజియస్ ఫిలింస్ ఓటీటీ బాట పట్టాయి.అందుల్లో నయనతార నెట్రికాన్అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది మిస్టరీ థ్రిల్లర్ ..కొరియన్ ఫిలిం బ్లైండ్ కి అఫీషియల్ రీమేక్. ప్రతీకారం తీర్చుకునే అంధ మహిళగా నయనతారను మనం ఈ సినిమాలో చూడోచ్చు. ఇక మరో సీనియర్ గాళ్ త్రిష తన 60 వ చిత్రం పరమపదం విలయాట్టుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్షమైంది.

కాజ‌ల్ అగ‌ర్వాల్, త‌మ‌న్నా, స‌మంత లాంటి అగ్ర క‌థానాయ‌కులు ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటికే కాజ‌ల్ న‌టించిన లైవ్ టెలికాస్ట్, త‌మ‌న్నా చేసిన లెవంత్ అవ‌ర్ విడుద‌ల‌య్యాయి.ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న కారణంగా ఓటీటీలకు సైన్ చేయడానికి అమలాపాల్ ,కీర్తి సురేష్ లాంటి నటీమణులు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే టాలీవుడ్ బ్యూటీలంతా తమ నెక్స్ట్ లెవల్ పర్ ఫార్మెన్స్ ను చూపిస్తారేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here