Home Entertainment Cinema

టాలీవుడ్ కుర్రహీరోలతో ఏజ్ బార్ హీరోయిన్ల రొమాన్స్

సీనియర్ హీరోయిన్లు,ఏజ్ బార్ భామలంతా తమకంటే ఏజ్ లో తక్కువున్నవారితోనే నటించడానికే ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే పాత్రలతో పాటు ,సినిమా కంటెంట్ కూడా అలాంటిదే కావడంతో కాదనలేకపోతున్నారు. అనుకోకుండా వచ్చిపడిన క్యారెక్ట్ డిమాండ్ ఓ వైపు …అలా చేస్తేనే ఆఫర్ ఇచ్చే సినిమాలు మరో వైపు ఉండడంతో భామలంతా కాంప్రమైజ్ పాలసీలో భాగంగా కుర్రాళ్లతో ఇలా కమిట్ అవ్వాల్సి వస్తుందంటూ టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

ముందుగా అనుష్క ఈవిషయంలో కాస్త ముందు వరుసలో ఉందనే చెప్పాలి.తాజాగా చేస్తున్న యువి క్రియేషన్స్ ఫిలింలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో ఈ సీనియర్ అందాల భామ స్క్రీన్ షేర్
చేసుకుంటుంది. ఇక మెహ్రీన్ ఆఫ్టర్ మ్యారీజ్ ఫిలింస్ చేయదేమో అనుకున్నారంత. కట్ చేస్తే మారుతి డైరెక్షన్ లో..ఏక్ మినీ కథ హీరో సంతోష్ శోభన్ తో కలిసి కవ్వించాలని చూస్తుంది.దర్శకుడు మారుతి సినిమా కావడంతో,ఈఫిలిం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది.

ఇక తథాస్తు సినిమాతో కన్నడలో కలరింగ్ ఇవ్వాలని చూస్తున్న క్యూట్ కాజల్ హీరో చిరాగ్ తో కెమిస్ట్రీ వర్కవుట్ చేయాలని చూస్తుంది. ఇక తెలుగుకు వచ్చేసరికి సమంతా కూడా ఈ రూట్లోనే జర్నీ చేస్తుందేమో అనిపిస్తుంది.ఓ బేబీ ఫిలింలో ఇప్పటికే తనకంటే ఏజ్ లో చిన్నవాడైన తేజ సజ్జాతో ఆడిపాడి సందడి చేసింది.ఫ్యామిలీ మేన్ 2 ఇచ్చిన రిజల్ట్ తో రానున్న రోజుల్లో వెబ్ సిరీస్ లతో మరింత బిజీ కావాలని చూస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here