Home News

తిరుపతి బీజేపీ ఓటమి పై కీలకంగామారిన రత్నప్రభ నివేదిక

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పై భారీ ఆశలు పెట్టుకుంది బీజేపీ. ఎన్నో లెక్కలు సామాజీక సమీకరణలతో మాజీ ఐఏఎస్ రత్నప్రభని అభ్యర్దిగా ఎంపిక చేసింది. అన్ని పార్టీల కంటే ముందుగానే తిరుపతి కేంద్రంగా సభలు సమావేశాలు నిర్వహించించింది. టీడీపీని అధిగమించి రెండో స్థానం సాధించాలని గట్టి పట్టుదల ప్రదర్శించించింది. ఒక వైపు జనసేన పోత్తు మరో వైపు నేతలంతా తిరుపతిలో మకాం వేసినా కనీస ఓట్లను సాధించలేకపోయింది కమలదళం. దీంతో అభ్యర్ది రత్నప్రభని దారుణ ఓటమి పై నివేదిక ఇవ్వాల్సిందిగా బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తుంది.

పార్టీ నేతల వైఫల్యం వల్లనే ఈ దారుణ ఓటమి ఎదురైనట్లు అభ్యర్ధి రత్నప్రభ నివేదిక పంపినట్లు తెలుస్తుంది. తనకు పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి పెద్దగా సహకారం అందలేదని, సమన్వయం కొరవడిందని రత్న ప్రభ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నేతలు మీడియా ముందు చేసిన హడావిడి క్షేత్ర స్థాయులో కనిపించలేదని తెలిపింది. ఇక జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆ ఓట్లను సాధించడంలో బీజేపీ విఫలమైందని తెలిపింది. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికలో దారుణ ఓటమి బీజేపీ నేతల భవిష్యత్ కు ఇబ్బందికరంగా మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here