తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కౌంటింగ్‌కు లైన్ క్లియరైంది. ఎన్నికను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంది ధర్మాసనం. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక రద్దు చేయాలని హైకోర్టు కెళ్లిన బీజేపీ, టీడీపీలకు షాక్ తగిలింది. ఆ రెండు పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్ రోజున అక్రమాలు జరిగాయన్నది బీజేపీ, టీడీపీ ఆరోపణ. వీరి పిటిషన్లపై సుదీర్ఘ విచారణ తర్వాత.. ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. షెడ్యూల్ ప్రకారం ఆదివారం తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టాలి. హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఒకింత ఉత్కంఠకు దారితీసింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపునకు లైన్ క్లియరైంది. ఏప్రిల్ 17 తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. వైసీపీ నుంచి గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభతోపాటు మొత్తం 28 మంది పోటీ చేశారు. వీరందరి భవితవ్యం మే 2న తేలనుంది.