Home News Stories

తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఎక్కడ…?

తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా ఎవరైనా ఉన్నరా…. లేదా అన్న అనూమానం తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలతో పాటు వైకాపా కేడర్ ను వెంటాడుతోంది. తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా బల్లి దుర్గా ప్రసాద్ ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన పార్లమెంట్ నియోజక వర్గంలో కాని ప్రచారంలో కనపడకపోవడంతో వైసీపీ అభ్యర్ధి బరిలో ఉన్నారా లేదా అన్న అనూమానం వైసీపీ కేడర్ ను కన్ ఫ్యుజ్ చేస్తుంది.

బల్లి దుర్గా ప్రసాద్‌ టీడీపీ నుంచి వైసీపీలో చేరి తిరుపతి వైసీపీ ఎంపి టికెట్‌ దక్కించుకున్నారు. ఎవరూ ఊహించని ఈ పరిణామం ఇటు టీడీపీలోనూ, అటు వైసీపీలోనూ కలవరం కలిగించింది. 33 సంవత్సరాలు టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెగదెంపులు చేసుకొని వైసీపీ గూటికి చేరారు. వెంకటగిరి ప్రాంతానికి చెందిన బల్లి దుర్గాప్రసాద్‌ 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. వృత్తిరీత్యా న్యాయవాదైన దుర్గాప్రసాద్‌ ఎన్‌టి రామారావు పిలుపుతో పార్టీలో చేరారు. అప్పుడు గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి రమణయ్య అభ్యర్థిపై విజయం సాధించారు. 1989లో మళ్లీ పోటీచేశారు. ఆ ఎన్నికల్లో పట్రా ప్రకాశరావు చేతిలో ఓటమిపాలయ్యారు. 1994,1999లో పోటీచేసి గెలిచారు. 2004లో ఆయనకు చంద్రబాబు నాయుడు టికెట్‌ నిరాకరించారు. మాజీ ఎంపి ఉక్కాల రాజేశ్వరమ్మకు టికెట్‌ ఇవ్వడంతో దుర్గాప్రసాద్‌ అలిగి వెళ్లిపోయారు.

నాలుగేళ్లు పార్టీకి, గూడూరు నియోజకవర్గానికి దూరంగా వెళ్లిపోయారు. అటు తరువాత 2009లో మళ్లీ ఆయనకే చంద్రబాబు టికెట్‌ కేటాయించారు. పనబాక కృష్ణయ్యపై విజయం సాధించారు. 2014న స్థానిక నేతలకు ఆయనను కాదని కొత్త అభ్యర్థి జ్యోత్స్నలతకు టికెట్‌ ఇచ్చారు. ఆ సమయంలో టికెట్‌ కోసం ప్రయత్నం చేసి రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేశారు. చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇవ్వడంతో ఉపసంహరించుకున్నారు. 2014 తరువాత వైసీపీ తరపున గెలిచిన పాశం సునీల్‌కుమార్‌ టిడిపిలో చేరారు. ఇప్పుడు దుర్గాప్రసాద్‌ టికెట్‌ కోసం పోటీపడ్డారు. సునీల్‌కుమార్‌కు టికెట్‌ దక్కింది. దాంతో మనస్తాపానికి గురైన ఆయన జగన్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న మరోసటి రోజు ప్రకటించిన పార్లమెంట్‌ అభ్యర్థుల జాబితాలో ఆయనకు తిరుపతి ఎంపి సీటు కేటాయించారు.

అంతవరకు బాగానే ఉన్న టికెట్లు దక్కించుకున్నా గూడురుకు మాత్రమే ఆయన పరిమితం అయ్యారు. తిరుపతి ఎంపీగా పోటిచేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో కీలమైన తిరుపతి,సత్యవేడు,శ్రీకాళహస్తిలో ఎక్కడ తిరిగిన దాఖాలు లేవని సమాచారం.ఈనెల 22 నామినేషన్ వేసిన తరువాత అయినా ఈ మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని స్ధానిక నాయకులు అనుకున్న అటువంటి ఊసే లేకుండా పోయింది. మరోవైపున తిరుపతి ఎంపీగా టీడీపీ నుండి బరిలోకి దిగుతున్న పనబాక లక్ష్మీ మాత్రం నెల్లూరుతో పాటు తిరుపతి,సత్యవేడు,శ్రీకాళహస్తిలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.తిరుపతి ఎమ్మెల్యే సుగునమ్మని వెంట బెట్టుకుని మరి తనదైన శైలీలో ప్రచారం చేస్తున్నారు.

అసలే ఎన్నికలు టగ్ ఆఫ్ వార్ గా ఉంటే ఎంపీ అభ్యర్ధి పరిస్థితి గమనించిన వైసీపీ కేడర్ కూడా మన ఎంపీ ఎక్కడా… అనే చర్చించుకుంటున్నారు..స్వతగాహా నెల్లూరు జిల్లా గూడురు చెందిన ఆయన అక్కడే ప్రచారం చేస్తున్నట్లుగా సమాచారం.అది కూడా ఒక్క గూడురుకు మాత్రమే పరిమితం అయ్యారనే ప్రచారం జరుగుతోంది..అసలే సమయం తక్కవగా ఉండటంతో తమ పార్టీ అభ్యర్ధి ప్రచారంలోకి దిగుతారా లేదా అన్న సస్పెన్స్ లో ఉంది వైసీపీ కేడర్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here