Home News Updates

ఇరుపక్షాల లక్ష్యం ఒక్కటే.. నిర్ణయంలోనే తడబాటు..?

తిరుపతి ఉపఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరుగనున్నాయి. అధికార పార్టికీ ప్రత్యామ్నాయంగా నిలవాలని ప్రజలలో ఉన్న ప్రభుత్వవ్యతిరేకతను ఎత్తిచూపాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. రాష్ట్రంలోని స్థానిక పార్టీల నిర్ణయాలు ఎలాఉన్నప్పటికి బీజేపీ- జనసేన మధ్య ఎవరు పోటీ చేయాలనే ఆలోచనలో పడ్డాయి. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం తిరుపతి ఉపఎన్నికే తొలి అడుగుగా భావిస్తున్నాయి ఈరెండు పార్టీలు.


అయితే గ్రేటర్ హైదరాబాద్‎లో జనసేన పోటీ నుంచి తప్పుకోగా తిరుపతిలో మాత్రంలో అలా వ్యవహరించాలని అనుకోవడం లేదట. జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి తప్పుకొని బీజేపీకి మద్ధతు ఇచ్చినందుకు తిరుపతి లోక్‎సభ స్థానానికి తమ అభ్యర్థినే పోటీలో నిలపాలని జనసేన భావిస్తోంది. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో దీన్ని పోల్చకూడదని కమనాథులు భావిస్తున్నారు. దానికి అదే..దీనికి ఇదే అనే ధోరణిలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటుబ్యాంకు ఉంది. గతంలొ 1999సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్ధతుతో తిరుపతిలో ఘనవిజయాన్ని సాధించింది బీజేపీ. మళ్లి అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దీంతో తామే పోటీ చేసి ఓటుబ్యాంకు మెరుగుపర్చుకోవాలని ప్రతిపక్షపార్టికి ప్రత్యామ్నాయంగా ఉండాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు

ఏదీఏమైనప్పటికి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు ఆదివారం సాయంత్రం సమావేశం కావడం ప్రత్యేకతను సంతరించుకోంది. ఇరు పార్టీల నుంచి ఎవరు పోటీ చేసినా ఉమ్మడి అభ్యర్థిగానే భావించాలని ప్రాథమికంగా నిర్థారించుకున్నట్టు సమాచారం. రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు జనసేనేని ప్రస్తావించగా..ఏపార్టీ పోటీలో నిలవాలనే విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వం మీదే వదిలేద్దామని సోమవీర్రాజు స్పష్టం చేసినట్లు వార్తుల వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here