Home News

గరుడ నామాల వివాదం ముగిసినట్లే

తిరుపతి గరుడ వ నామాల వివాదం ఎట్టకేలకు ముగిసింది . లఫ్ తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధి ఫై శ్రీవారి నామాలు ముద్రించారు. అయితే నామాల ఆకారం సరి కొత్త వివాదానికి కారణం అయింది.
ఆసలు శ్రీ‌వారి నామం ఎలా ఉండాల‌న్న‌దానిపై ఎప్ప‌టి నుంచో వివాదం న‌డుస్తుంది. వైష్ణ‌వ సాంప్ర‌దాయంలో సాధారణంగా రెండు వ‌ర్గాలు ఉన్నాయి. వ‌డ‌గ‌లై సాంప్ర‌దాయ వాదులు తిరునామాన్ని ఆంగ్లం యూ ఆకారంలో దిద్దుతారు. తెంగ‌లై సాంప్ర‌దాయం ప్రకారం ఆ వాదులు శ్రీ వారి నామాన్ని వై ఆకారంలో దిద్దుతారు. అయితే అధికారులు మాత్రం వ‌డ‌గ‌లై ప్ర‌కారం పిల్ల‌ర్స్‌పై నామాన్ని ముద్రించారు. ఆ మేరకు రంగులు వేశారు. దీనిపై తెంగ‌లై వాదుల నుండి ప్ర‌తి ఘ‌ట‌న తలెత్తింది . దాంతో టి టి డి అధికారులు వివాద ర‌హిత‌మైన ముద్ర అంటే చతుర‌స్ర ఆకార నామాలను కొత్త‌గా పిల్ల‌ర్స్‌పై వేశారు.


.
దాదాపు 684 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మిస్తున్న గ‌రుడ వార‌ధి నిర్మాణ ప‌నులు వ‌చ్చే ఏడాది క‌ల్లా పూర్తి కావాల్సి ఉంది. ఇప్ప‌టికే పిల్ల‌ర్ల నిర్మాణం పూర్తైంది. ఫ్లై ఓవ‌ర్‌లోని 36 పిల్ల‌ర్ల‌పై శ్రీ‌వారి నామాల‌ను అచ్చువేశారు. ఇప్పుడిప్పుడే వాటికి రంగుల‌ను అద్ద‌డం మొద‌లు పెట్టారు. రంగులు వేసిన త‌రువాత చూసిన వారంద‌రూ భ‌లే ఉంద‌నుకున్నారు. కానీ, అక్క‌డే కొత్త వివాదం మొద‌లైంది.ఈ నామం పై రెండు వర్గాల నుంచి అభ్యంతరాలు బ;ద వచ్చా యి .

నిజానికి తిరుమ‌లలో జీయ‌ర్ల‌కు, అర్చ‌కుల‌కు మ‌ధ్య చాలా ఏళ్లుగా నామాల వివాదం కొన‌సాగుతోంది. ఇప్పుడు ఈ పిల్లెర్స్ పై ముద్రించిన నామాలు ఆ వివాదాన్ని తిరగ తోడాయి అని అధికారులు కాస్త ఆలోచించారు .రెండు వ‌ర్గాల‌కు చెందిన వై, యూ ఆకారాల‌ను క‌లుపుతూ కొత్త‌గా చ‌తుర‌స్రాన్ని పోలి ఉండే ఓ విభిన్న నామాన్ని సృష్టించినా కూడా వివాదం సమసిపోలేదు . దాంతో ఇక నామాలు వదిలివేసి తిరుపతి స్మార్ట్ సిటి గుర్తును పిల్లర్స్ పై ముద్రించాలని టి టి డి నిర్నయించింది . దాంతో ఈ వివాదం సమసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here