Home News Politics

తండ్రి టీడీపీ,కొడుకు వైసీపీ…ఇది సూళ్ళూరుపేట సిత్రం

తండ్రి కొడుకుది రక్త సంబంధం. అయినంత మాత్రాన తండ్రి అభిమానించిన హీరోని,కొడుకు అభిమానించాలని లేదు.కానీ తండ్రి ఒక పార్టీ తరపున రాజకీయాల్లో పనిచేస్తున్నప్పుడు కొడుకు మద్దతు ప్రకటించకపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితే నెల్లూరులో చోటుచేసుకుంది. తండ్రి కొడుకులు ఇద్దరు ఒక కుటుంబం వారే అయినా రెండు పార్టీల తరపున పనిచేస్తున్నారు. వ్యక్తిగతంగా వాళ్లు ఎలా ఉన్నా.. మధ్యలో వాళ్ల అనుచరులు మాత్రం తండ్రి గారి జెండా పట్టాలో,కొడుక్కు జై కొట్టాలో తెలియక నలిగిపోతున్నారు. తండ్రి టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తుంటే,కొడుకు వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నాడు…అనుచరులు మాత్రం అయోమయానికి గురవుతున్నారు.

మొన్నటి వరకూ తండ్రి కొడుకులు ఒకే పార్టీలో ఉన్నపుడు మద్దతుదారులకు ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడైతే తండ్రి, కొడుకులు పార్టీల వారీగా విడిపోయారో అప్పటి నుండి మద్దతుదారుల్లో కూడా అయోమయం మొదలైపోయింది. ఇంతకీ ఇదంతా ఏ జిల్లాలో అని ఆశ్చర్యపోతున్నారా ? నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట నియోజకవర్గంలో…

నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ అంటే ముందుగా గుర్తుకువచ్చేది వేనాటి కుటుంబమే. అటువంటి కుటుంబం నుండి వేనాటి రామచంద్రరెడ్డి ప్రస్తుతం జిల్లా పరిఫత్ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన కొడుకు వేనాటి సుమంత్ రెడ్డి సూళ్ళూరుపేట మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్. పార్టీలో ప్రధానంగా యూత్ లో బాగా చొచ్చుకుపోయారు. అటువంటిది పాదయాత్ర సందర్భంగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో టిడిపికి పెద్ద దెబ్బపడింది.

తమ కుటుంబానికి చంద్రబాబు సరైన గుర్తింపు ఇవ్వలేదన్న కారణంతో సుమంత్ రెడ్డి ఎప్పుడైతే వైసీపీలో చేరారో పార్టీకి సూళ్ళూరుపేటలో మంచి ఊపొచ్చింది. అప్పటి నుండి వైసిపి తరపునే నియోజకవర్గం మొత్తం పర్యటనలు చేసేస్తున్నారు. మంత్రి నారాయణపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. అయితే రామచంద్రారెడ్డి టీడీపీకి మద్దతుగానే నిలబడినా వయస్సు రీత్యా చురుగ్గా పనిచేయలేకపోతున్నారు. దానికితోడు నియోజకవర్గంలో సైకిల్ పార్టీ పరిస్ధితి రోజురోజుకు దిగజారిపోతుండటం మంత్రి నారాయణకు బాగా ఇబ్బందిగా తయారైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here