Home Entertainment Cinema

గుండెపోటుతో కన్నుమూసిన కుర్ర హీరో..

ఇండస్ట్రీలో ఒకే రోజు రెండు విషాదాలు జరిగాయి. చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ కన్నుమూసిన విషాదం నుంచి బయటకు రాకముందే ఒక కుర్ర హీరో గుండెపోటుతో మరణించాడు. తెలుగు తమిళ సినిమాలు చేస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ హఠాన్మరణం చెందాడు. పరారే పరరె, ఫ్రెండ్స్ బుక్ లాంటి పలు తమిళ సినిమాలలో హీరోగా నటించిన నందురీ ఉదయ్ కిరణ్ (34) కన్నుమూసాడు. ఫిబ్రవరి 14 రాత్రి 10.30కు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందాడు ఉదయ్ కిరణ్. ఈయన పేరుకు తమిళ సినిమాలు చేసినా కూడా తెలుగు కుర్రాడు. ఉదయ్ కిరణ్ మరణవార్త తెలుసుకుని స్థానికులతో పాటు.. తమిళ సినిమా ఇండస్ట్రీ కూడా షాక్ అయిపోయింది.

Uday Kiran Junior

ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రహీరో ఇలా అర్ధాంతరంగా మరణించడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రామారావు పేట తన స్వగృహంలో పార్థివ దేహాన్ని ఉంచారు కుటుంబ సభ్యులు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు పలువురు పెద్దలు.. రాజకీయ నాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here