Home Entertainment Cinema

తెలుగు సినిమా పై తెలంగాణ ముద్రెందుకు…?

తెలంగాణ సినిమాల మీద మన అతి ప్రచారమే మన కొంపలు ముంచుతుందేమో.. సినిమాలు మంచిగున్నయని చెప్పుకుంటున్నా కలెక్షన్లు మాత్రం పూర్.. మన డైరెక్టర్, మన హీరో అని చెప్పుకుంటే తప్పు లేదు గాని ఇది కేవలం తెలంగాణ సినిమానే అని ప్రచారం చేసుకోవడంతో దీన్ని ఇక్కడోల్లు తప్ప ఎక్కడ చూశే పరిస్థితి కనిపించే పరిస్థితిలేదు..

ఎంత కాదనుకున్నా సినిమా సుతారం ఒక వ్యాపారమే.. లాస్టుకు లెక్కలతోనే పని.. ఒక సినిమాను ఒక ప్రాంతానికే పరిమితం చేయడం వల్ల మంచి సినిమాలు అందరికీ దగ్గర కాలేకపోతున్నయి.. మల్లేశం, దొరసాని లకు రివ్యూలు ఒచ్చినంత కలెక్షన్లు రాలేదనేది వాస్తవం.. దీనికి కారణం మన అతి ప్రచారమే.. తెలుగు సినిమాను తెలంగాణ సినిమా అని వేరు చేయడం.. దానితోని పెద్ద పెద్ద సినిమాలు బాగుపడుతున్నయి.. అండ్ల ఇక్కడ యాస మాట్లాడి కోట్లు కొల్లగొడుతున్నయి.. ఈ విషయంలో ఆల్లకున్నంత లౌక్యం మనకు లేదు..

అంతెందుకు ఇస్మార్ట్ శంకర్ అని తీసి వారంలో 50 కోట్లు రాబట్టుకున్నరు.. మరి మన మల్లేశానికి ఎందుకు రాలే.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి,ఫిదా లాంటి సినిమాలకు ఈ బ్రాండ్ పడలే కాబట్టి అందరు చూశారు.. కానీ ఇప్పుడొస్తున్న సినిమాలకు అతి ప్రచారం తో నడిమిట్లనే ఎగరగొట్టవలసి ఒస్తుంది.. కలెక్షన్లు రాకపోతే ఆ డైరెక్టర్లకు రెండో సినిమా ఛాన్సులు ఎట్ల వస్తయి..?

డైరెక్టర్లు కూడా బోనాలో, బతుకమ్మలో చూపెట్టడానికి సీన్లు రాస్కోకండ్రి.. కథల భాగమైతే రాస్కోండ్రి.. తెలంగాణ రాకముందు నుంచే మన పండుగలు అందరికీ తెలిశాయి.. ఇగ పండుగకు ముందు వందల యూట్యూబ్ చానెళ్లు పాటలు ఒదులుతున్నయి.. ఒకరకంగా అవే ఎక్కువ అయ్యాయి కూడా.. మల్ల అవ్వే సినిమాల్లో కూడా పెట్టుకుంటూ పోతే డాక్యుమెంటరీలు తప్ప సినిమాలు అనిపించుకోవు.. మన బతుకులను, మన మనుషులను చూపిస్తే చాలు.. అక్కడే మస్తు కథలు అల్లొచ్చు..

ఇంకో సంగతి ఏందంటే రేపు రాబోయే వేణు ఉడుగుల సినిమా “విరాట పర్వం” కి ఇట్లాంటి ట్యాగ్ లు పెట్టి ఖరాబ్ చేయకుండా ఉండటం బెటర్.. మనోల్లు పాన్ ఇండియా సినిమాలు చెయ్యాలే గాని తెలంగాణకే పరిమితం కావొద్దు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here