Home News Stories

మన మీడియాకు ఏమైంది…?

కొన్ని విషయాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పట్టవు, ఆనవు. మరీ మన దిక్కుమాలిన తెలుగు మీడియా కౌశల్ ఆర్మీ వంటి చిల్లర ఇష్యూలపై కాన్సంట్రేట్ చేస్తున్నంతగా మిగతా ప్రధానాంశాలపై, జాతి మూడ్‌కు అనుగుణంగా వ్యవహరించడంపై దృష్టి పెట్టదు. టీవీ5, టీవీ9… అందరూ అదే వేవ్ లెంత్… పాకిస్థాన్ ఆర్మీ అదుపులో ఉన్న మన వింగ్ కమాండర్ అభినందన్ విషయంలో మన మీడియా కవరేజీ చాలా పూర్…ఒకటీఅరా పత్రికలు తప్ప అభినందన్ భార్య కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అనే అంశాన్ని గుర్తించలేకపోయాయి, రాయలేకపోయాయి, చూపలేకపోయాయి…

అలాగే కూలిపోతున్న మిగ్ యుద్ధవిమానం నుంచి అభినందన్ కిందపడిపోయాక జరిగిందేమిటి..? ఇంగ్లిషు మీడియా, సోషల్ మీడియా మంచి కథనాలను వెలువరించాయి. అల్లాటప్పాగా రాసేయడం గాకుండా ఏకంగా పాకిస్థానీ దినపత్రిక డాన్ కథనాన్ని ఉదహరిస్తూ సొంత కథనాల్ని రాసుకున్నాయి…

పాకిస్థానీ సోషల్ యాక్టివిస్టు కమ్ ప్రత్యక్ష సాక్షి ‘డాన్’కు చెప్పిన వివరాలే అవి… ‘‘పారాచూట్ సాయంతో ఓ వ్యక్తి సురక్షితంగా దిగుతుండటం కనిపించింది… వాయుసేన డ్రెసు కనిపిస్తూనే ఉన్నది… తనెక్కడ దిగాడో అర్థం కానట్టుంది… తన దగ్గర ఓ పిస్టల్, కొన్ని మ్యాపులు ఉన్నయ్… పడిన వెంటనే కాస్త ఊపిరి పీల్చుకునేలోపు కొందరు స్థానికులు అక్కడికి చేరుకున్నారు… తనెవరో వాళ్లకూ తెలియదు… నేనెక్కడ ఉన్నాను, ఇది ఇండియా? పాకిస్థానా..? అనడిగాడు… ఓ స్థానికుడు ఇది ఇండియా అని అబద్ధం చెప్పాడు… కానీ అభినందన్ నమ్మినట్టు కనిపించలేదు… నిజం చెప్పండి అంటూ అరిచాడు… తన చుట్టూ రౌండప్ చేయటానికి ప్రయత్నిస్తున్న స్థానికులను గమనించి ఒక్క ఉదుటున లేచి ఇండియా దిశగా ఓ అరకిలోమీటర్ పరుగు తీశాడు…

స్థానికులు వెంటపడ్డారు… పిస్టల్ చూపిస్తూ, అదిలిస్తూ అలాగే పరుగు తీసిన అభినందన్ హెచ్చరికగా గాలిలోకి కాల్పులు కూడా జరిపాడు… ఈలోపు తనకు కనిపించిన ఓ నీటికుంటలోకి దూకి, తన వెంటన ఉన్న డాక్యుమెంట్లు, మ్యాపులను నమిలి మింగేందుకు ప్రయత్నించాడు… ఆ ముక్కల్ని నీటిలో ముంచాడు… పిస్టల్ కింద పడేయాలంటూ స్థానికులు అరిచారు… ఓ యువకుడు తన దగ్గరున్న తుపాకీతో పైలట్‌కు గురిపెట్టాడు… అప్పటికే తన వద్ద ఉన్న పత్రాల్ని నిరుపయోగం చేసిన అభినందన్, ఇక చేసేదేమీ లేక, పరిస్థితి అర్థమైపోయి… ‘డోంట్ కిల్ మి’ అని అరిచాడు… అప్పటికే అభినందన్‌ను చుట్టుముట్టిన స్థానికులు తనను చితకబాదారు… రక్తం కారుతున్నప్పటికీ ఆ పైలట్ నిబ్బరం కోల్పోలేదు… తనను ఆర్మీకి అప్పగించాలని అడిగాడు… కొద్దిసేపటికి సైనికులు కొందరు అక్కడికి చేరుకున్నారు… తనను అదుపులోకి తీసుకున్నారు… తరువాత ఓచోట అభినందన్‌ను ప్రశ్నిస్తున్న తీరు, తను ఏమీ చెప్పలేనంటూ వివరాలు చెప్పటానికి నిరాకరించిన తీరు అందరూ అదే పాకిస్థాన్ మీడియా, అధికారిక సైట్లు ప్రదర్శించాయి… అందరూ చూసిందే… ఆ తెగువ, ఆ నిబ్బరమే ఇప్పుడు ఆ కమాండర్‌ను జాతీయ హీరోను చేశాయి.

కేవలం ₹ 500కు అమ్ముడుపోయే మా కోసం నీవు ప్రాణాలే త్యాగంగా పెట్టావు… క్వార్టర్ మందుకే మేము పార్టీలు మారతాం.. నీకెందుకు సార్ ఇంత దేశ భక్తి.. శత్రువుల చేతికి చిక్కినా మొక్కవోని నిబ్బరంతో నీవు చెబుతున్న జవాబులు మా స్వార్థపూరిత జీవితాల్ని ప్రశ్నిస్తున్నాయి… ప్రభుత్వాలు మాకెమిచ్చాయని నిత్యం ప్రశ్నించే మా బతుకుల పరమార్థాన్ని నీ మనోనిబ్బరం మమ్మల్ని ‌దోషిగా నిలబెడుతోంది.. ఏ కాంట్రాక్ట్ లో ఎంత దొబ్బొచ్చో అని నిత్యం ఆలోచించే మా రాజకీయ జీవితాలు నీ అనితర త్యాగం ముందు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి!’’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here