Home Entertainment Cinema

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..

పెళ్లి తర్వాత అందరూ అడిగిన మొదటి ప్రశ్న.. శుభవార్త ఎప్పుడు అని. కానీ అదే శుభవార్త పెళ్లికి ముందు వింటే మాత్రం వినడానికి కూడా చాలా తేడాగా ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం పెళ్లి తర్వాత గర్భవతి కావాలి అనే రూల్స్ ఎక్కడా ఉండవు. తెలుగు ఇండస్ట్రీలో కొందరు ముద్దుగుమ్మలు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయ్యారు. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం..

  1. శ్రీదేవి..

అతిలోక సుందరి శ్రీదేవి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. భౌతికంగా ఏమీ దూరమై రెండేళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ అభిమానులు ఆమెను ఆదరిస్తూనే ఉన్నారు.. ఇంకా మరిచిపోలేకపోతున్నారు. అయితే ఈమె పెళ్లికి ముందే జాన్వీ కపూర్ ను కడుపులో మోసింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. గర్భవతి అయిన తర్వాత బోని కపూర్ ను పెళ్లి చేసుకుంది శ్రీదేవి.

2 రేణు దేశాయ్..

ముంబై నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మరాఠి అందం రేణుదేశాయ్. బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ ఈమెని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ తర్వాత జానీ సినిమాలో కలిసి నటించారు. కానీ అప్పటికే ఇద్దరు ప్రేమలో ఉన్నారు. సహజీవనం కూడా చేశారు. దాంతో పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది రేణు దేశాయ్. 2009 ఎన్నికల సమయంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. 2011లో విడిపోయారు.

3.సెలీనా జైట్లీ..

మంచు విష్ణు హీరోగా అప్పట్లో వి.సముద్ర తెరకెక్కించిన సూర్యం సినిమా గుర్తుండే ఉంటుంది. ఇందులో విష్ణుకి జోడిగా నటించిన సెలీనా జైట్లీ.. ఆ తర్వాత తెలుగు సినిమాలు పెద్దగా చేయలేదు. కానీ ఈమె కూడా పెళ్లికి ముందే గర్భవతి అయింది. కవలలకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంది. 2011 జూలైలో తన బాయ్ ఫ్రెండ్ పీటర్ హాగ్ ను పెళ్లి చేసుకుంది సెలీనా. కానీ అదే ఏడాది మార్చిలో కవలలకు జన్మనిచ్చింది ఈమె.

4. సారిక..

తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సారిక 1980ల ప్రారంభంలో కమల్ హాసన్ తో సహజీవనం చేసింది. అప్పట్లో అసలు ఇండియాలో సహజీవనం అనే కాన్సెప్టు లేని సమయంలోనే ఇద్దరూ కలిసి జీవించారు. దీనికి ప్రతిఫలంగా పెళ్లికి ముందే శృతిహాసన్ కు జన్మనిచ్చింది సారిక. ఆ తర్వాత అక్షర హాసన్ కూడా కమల్ సారిక దంపతులకు పుట్టింది.

5.అమృతా అరోరా..

ఈమె గర్భం గురించి బాలీవుడ్లో సంచలనం అయ్యింది. ఇప్పటివరకు ఈమె ఎవరితో రిలేషన్ షిప్ లో ఉందో కూడా బయటకి తెలియదు.. కానీ ఉన్నట్టుండి ఒక రోజు బిజినెస్ మాన్ షకీల్ లడక్ తో రిలేషన్ లో ఉన్నట్టు చెప్పింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. కానీ అప్పటికే ఒక పాపకు జన్మనిచ్చింది. అమృతా అరోరా దీన్ని బట్టి ఇద్దరు ప్రేమలో ఉన్నారని అర్థమైపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here