Home News Updates

టాలీవుడ్ లో విషాదం..నిర్మాత బీఏ రాజు మృతి

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సినీ నిర్మాత,సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు గుండెపోటుతో మరణించారు. సినిమా జర్నలిస్ట్,పలువురు హీరోలకు పీఆర్వోగా కెరీయర్ ప్రారంభించిన బీఏ రాజు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. జర్నలిస్ట్‌గా సూపర్‌హిట్‌ వారపత్రికను నడుపుతున్నారు. బీఏ రాజు భార్య జయ పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. 2018లో జయ మృతి చెందారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోలు నుంచి యువ హీరోల వరకూ, దాదాపు 1000కి పైగా చిత్రాలకు ఆయన పీఆర్వోగా వ్యవహరించారు. బీఏ రాజు కృష్ణకి వీరాభిమాని ఆయన ప్రోత్సహంతోనే సీనీ రంగంలోకి అడుగుపెట్టారు. బీఏ రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులతో కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రాజు అర్దరాత్రి కన్నుమూశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here