Home News

తెలంగాణకు కొత్త సీఎంగా కేటీఆర్..?

కేసీఆర్ స్థానంలో కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేపట్టబోతున్నాడ అంటే వాస్తవమనే చెప్పుకోవాలి. ఎందకంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన తెరాసలో నేడు నూతన న్యాయకత్వానికి పావులు కదుపుతున్నారు.

రాష్ట్ర ఆరోగ్యమంత్రి మొదలుకొని పలువురు ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ కాబోయే సీఎం అంటూ ప్రకటిస్తున్నారు. ఇదే విషయంపై మంత్రి గంగుల ఏకంగా ప్రతి పక్షపార్టీ బీజేపీ మీద గుస్సుమన్నారు. మాపార్టీలో కేటీఆర్ రాష్ట్రానికి సీఎం అయితే బీజేపీకి వచ్చిన ముప్పేంటంటూ మండిపడ్డారు.
ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నట్లు ప్రకటనలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఓఅడుగు ముందుకేసి.. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా కొడుకును సీఏం చేసేందుకే కేసీఆర్ కాళేశ్వరం వెల్లారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుకొచ్చారు. మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కరుణాకర్, శ్రీనివాస్ గౌడ్ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటనలు మొదలు పెట్టారు. మంత్రులు ఇప్పటికే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుతుండగా… కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు అంటూ తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీమంత్రి పద్మారావు ఆయన ముందే వ్యాఖ్యానించారు. పద్మారావు చేసిన ఈవ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించకపోవడంసరి కనీసం ఖండించలేదు. దీంతో తాను త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నాననే విషయాన్ని ఆయన కూడా అంగీకరించినట్టే అని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నమాట. ఇంతవరకు బాగానే ఉన్నా.. కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎప్పుడు పగ్గాలు చేపడతారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉండగా తెలంగాణాలో అతిపెద్ద రాజకీయ పరిణామానికి రంగం సిద్దమవుతోంది? చాలా కాలంగా
2014లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో గుంపగుత్తగా దక్కిన మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టింది. ఆతర్వాత 2014 జూన్ రెండవ తేదీన ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. తదనంతర క్రమంలో టీఆర్ఎస్ బలాన్ని అనూహ్యంగా పెంచేశారు. అప్పటి వరకు తెలంగాణలో బలంగా కనిపించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను నామమాత్రపు పార్టీలుగా మార్చేసిన రాజకీయ చతురత కేసీఆర్ సొంతం చేసుకున్నారు. గులాబీ పార్టీ దూకుడు ముందు నిలువలేక టీడీపీ పార్టీ తెలంగాణలో తమ దుకాణాన్ని దాదాపు మూసి వేసింది. కాంగ్రెస్ పార్టీ తమ ప్రజా ప్రతినిధులను కాపాడుకోలేక చతికిలా పడింది.
గులాబీ పార్టీ తాకిడికి తెలుగుదేశం సొంతంగా పోటీ చేసే పరిస్థితి కల్పించుకుకోలేక పోయింది. చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోని అతికష్టం మీద గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా టీడీపీ కాపాడుకోలేకపోయిందంటే కేసీఆర్ వ్యూహం ఎంతగా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిందో ఊహించుకోవచ్చు. అటు కాంగ్రెస్ కూడా తమ పార్టీ తరపున గెలిచిన 19 మందిని కాపాడుకోలేక పోయింది. 12, 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తమ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమైనా ఏమి చేయలేని పరిస్థితికి చేరింది కాంగ్రెస్.
రెండో దఫా అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ సత్తా చాటింది. అయితే విజయాల పరంపరకు దుబ్బాక ఉప ఎన్నిక బ్రేక్ వేసినప్పటికీ.. తెలంగాణలో ఇప్పటికీ టీఆర్ఎస్‌ను ఢీకొనే
సత్తా లేకపోయింది.

ఇదిలా వుంటే.. కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే తేదీపై కూడా ప్రచారం జోరందుకుంది. ఫిబ్రవరి 18వ తేదీన కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీనిని అధికార పార్టీ నేతలు కూడా ఖండించడం లేదంటూ ఈ తేదీ దాదాపు ఖరారైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంకోవైపు వివిధ దేశాలలో వున్న కేటీఆర్ స్నేహితులు, అనుచరులు, అభిమానులు ఫిబ్రవరి 18వ తేదీనాటికి హైదరాబాద్‌లో వుండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి ముహూర్తానికి ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టడం ఖాయమని చెప్పుకుంటున్నారు. అయితే జరుగుతున్న ప్రచారం కేసీఆర్ వ్యూహంలో భాగమా? లేక నిజంగానే ముఖ్యమంత్రి పీఠం తనయునికి అప్పగిస్తున్నారా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here