Home News

ఢిల్లీలో వేగంగా మారుతున్న పరిణామాలు..రేవంత్ కే టీ పీసీసీ

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పేరు నేడు ఖరారయ్యే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. హైకమాండ్ పిలుపుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తుంది. ఈరోజు, రేపటిలోగా పీసీపీ అధ్యక్ష పదవి ఎంపిక పూర్తయ్యే అవకాశముంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డిలు రేసులో ఉన్నారు.

కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి వారం తిరక్కముందే మళ్ళీ ఢిల్లీకి వెళ్లడం హాట్‌టాపిక్‌గా మారింది. అదీ ఉత్తమ్‌తో భేటీ తర్వాత ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇటీవలే కోమటిరెడ్డి ఢిల్లీ వెళ్లి నాలుగు రోజులు అక్కడే ఉండి వచ్చారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలసిన ఆయన పనిలో పనిగా కాంగ్రెస్‌ పెద్దలనూ కలసివచ్చారు.

గత పర్యటనలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్‌ను కలసిన కోమటిరెడ్డి తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు ఫోన్‌ చేసి కొంత కటువుగానే మాట్లాడారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే టీపీసీసీ చీఫ్‌ గా రేవంత్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here