Home Health corona

బ్రేకింగ్: తెలంగాణలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడగింపు

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడగిస్తూ సర్కార్ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఓ వైపు పెరుగుతున్న కేసులు మరో వైపు హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో లాక్ డౌన్ ఉంటుందన్న ప్రచారం సైతం నడిచింది. నైట్ కర్ఫ్యూ ఈరోజు రాత్రితో ముగుస్తుండటంతో మ‌రో వారం రోజులు నైట్ క‌ర్ఫ్యూ పొడగిస్తు నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. పొడగింపు నేపథ్యంలో మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది.

రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూని పొడిగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మరో వైపు తల పై గన్ పెడితే తప్ప నిర్ణయాలు తీసుకోరా..ప్రభుత్వం ఆదేశాలు తీసుకోకపోతే తామే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. 45 నిమిషాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు హెచ్చరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here