Home News

ఖమ్మం,వరంగల్ లో ఉద్రిక్తత..తెలంగాణలో ముగిసిన మినీపురపోరు పోలింగ్

తెలంగాణలో మినీ పురపోరు ముగిసింది.వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కోత్తూర్, నకిరేకల్, మున్సిపాలిటీల పోలింగ్ ముగిసింది. అయితే కరోనా వైరస్ ఉధృతి అధికంగా ఉండడంతో…కోవిడ్ నిబంధనల మధ్య పోలింగ్ అంటు హడావిడి చేసిన అది ఎక్కడ కనిపించలేదు.

ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయ్. పీజీ కాలేజ్ సెంటర్ ముందు కాంగ్రెస్,టీఆర్‌ఎస్ కార్యకర్తల బాహాబాహీకి దిగారు. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సెంటర్ ముందు ఒకరినొకరు తిట్టుకుంటూ దాడులకు దిగారు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు. మరోవైవు..దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.

వరంగల్ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా స్వల్ప ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయ్. శివనగర్ 34వ డివిజన్‌లో కాషాయ దుస్తులు దరించారని టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. బిజెపి అభ్యర్థికి చెందిన కార్యకర్తలు డివిజన్‌లో జరుగుతున్న ఎన్నికల కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారని టిఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. దీంతో వారి మధ్య స్వల్ప వాగ్వాదం జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. కరోనా కారణంగా ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. 49.25% శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 60.38 శాతం పోలింగ్ నమోదయింది. అయితే ఈ సారి మాత్రం కొవిడ్ నేపథ్యంలో 11శాతం పోలింగ్ తగ్గింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here