Home News

మినీ మున్సిపల్ ఎన్నికల్ల్లో టీఆర్ఎస్ హవా

తెలంగాణలో జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల్ల్లో…టీఆర్ఎస్‌ పార్టీ సత్తా చాటింది. నాగార్జున సాగ‌ర్‌లో కొన‌సాగించిన దూకుడును…మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎదురులేదని నిరూపించింది. జ‌డ్చర్ల, కొత్తూరు, న‌కిరేక‌ల్, అచ్చంపేట‌ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజ‌నం సృష్టించింది. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక ఖమ్మం,వరంగల్ కార్పోరేషన్లలోనూ గులాబీ జెండా ఎగరేసింది.

20 వార్డులున్న అచ్చంపేట మున్సిపాల్టీలో…మెజార్టీ స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపొందింది. 13 వార్డుల్లో టీఆర్ఎస్‌ పార్టీ గెలవగా…ఆరు చోట్ల కాంగ్రెస్‌, ఒక చోట బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. జ‌డ్చర్ల మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 27 వార్డుల‌ ఫలితాలు వెలువడ్డాయి. 24 వార్డుల్లో గులాబీ జెండా ఎగురువేసింది. కాంగ్రెస్‌, బీజేపీ చెరో స్థానాల్లో విజయం సాధించాయ్. జడ్చర్ల మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత…ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.

రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ కైవ‌సం చేసుకుంది. ఇక్కడ మొత్తం 12 వార్డులుంటే…7 వార్డుల‌ను కైవ‌సం చేసుకుంది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఛైర్మన్‌ పదవి టీఆర్ఎస్‌ ఖాతాలోకి వెళ్ళనుంది. నకిరేకల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. ఇక్కడ 20 వార్డుల‌కు…11 వార్డుల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుంది. ఇతరులకు 8 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీకి ఒక సీటు వచ్చింది.

సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో TRS ఘన విజయం సాధించింది. మొత్తం 43 వార్డుల్లో 36 సీట్లను గెల్చుకుంది. ఐదు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా, బీజేపీ, ఎంఐఎం ఒక్కో వార్డు దక్కించుకున్నాయి.జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి…బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఈ గెలుపుతో జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌ బలం మూడుకు పెరిగింది.

ఖమ్మం కార్పోరేషన్ లో ఇప్పటివరకు 58 డివిజన్ ల ఫలితాలు వెల్లడించగా టీఆర్ఎస్ 43 కాంగ్రెస్ 9 సీపీఐ 3 సీపీఎం2 బీజేపీ 1 స్థానంలో విజయం సాధించారు. ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నిక కౌంటింగ్ ఆలస్యంగా సాగుతున్నాయి. 66 డివిజన్లలో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ హవా కొనసాగుతుంది. 50 కి పైగా డివిజన్లలో టిఆర్ఎస్ ఆదిక్యంలో ఉంది బీజేపీ కూడా గతం కంటే కొంత మేర పుంజుకుని 10 డివిజన్లు సాధించింది. కాంగ్రెస్ ఒక స్థానం గెలువగా ఇండిపెండెంట్ 3 చోట్ల గెలుపొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here