Home News

ముగిసిన మినీ మున్సిపోల్స్‌ ప్రచారం..ప్రలోభాలు,పోలింగ్ పై ఫోకస్ పెట్టిన పార్టీలు

తెలంగాణలో మినీ మున్సిపోల్స్‌ ప్రచారం ముగియడంతో పార్టీలు ప్రలోభాలు,పోలింగ్‌పై ఫోకస్‌ పెట్టాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ తర్వాత పెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్లు అయిన వరంగల్‌, ఖమ్మంలలో పాగా వేయడానికి పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. తక్కువ సమయంలోనే ప్రచారం ఊదరగొట్టాయి. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగించడం ఆనవాయితీ. కానీ.. కరోనా ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకుని ప్రచారాన్ని 72 గంటల ముందు ఆపేయాలని ఎస్ఈసీ ఆదేశాలిచ్చింది.

రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, సిద్ధిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్‌ పురపాలక సంఘాలు ప్రచార హోరు నుంచి సైలెంట్‌ అయ్యాయి.
ఈ నెల 30న ఓటింగ్ జరుగుతుంది. ప్రచారం ముగించినా ఈ 72 గంటల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టే వ్యూహాల్లో పార్టీలు బిజీ అయ్యాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు పోటాపోటీగా ఫైట్‌ చేస్తుండటంతో పోరు ఆసక్తిగా ఉంది.

వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 66, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉన్నాయి. సిద్ధిపేట మున్సిపాలిటీలో 43 వార్డులు, జడ్చర్లలో 27, అచ్చంపేటలో 20, నకిరేకల్‌లో 20, కొత్తూరులో 12 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మంలో ఒక డివిజన్‌ ఏకగ్రీవమైంది. వరంగల్‌లో పార్టీలు హోరాహోరీగా కుస్తీపడుతుంటే.. ఖమ్మంలో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలో దిగాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాలన్నీ కీలక నగరాలు, పట్టణాలు కావడంతో తెలంగాణలో మినీ మున్సిపోల్స్‌పై ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here