Home News

    బ్రేకింగ్: తెలంగాణ లాక్ డౌన్ పొడగింపు..కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం..!

    తెలంగాణాలో మరోసారి లాక్ డౌన్ పొడగించింది కేసీఆర్ సర్కార్. మరో పదిరోజుల పాటు అంటే జూన్ పది వరకూ లాక్‌డౌన్ పొడిగించారు. అదే సమయంలో లాక్ డౌన్ మినహాయింపు సమయాన్ని ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పొడిగిస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణాలో ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. కరోనా కేసులు కూడా తెలంగాణలో తగ్గుముఖం పట్టడంతో క్రమంగా అన్ లాక్ దిశగా చర్యలు తీసుకుంటుంది తెలంగాణ సర్కార్.

    కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ముందుగా నైట్ కర్ఫ్యూ విధించిన తెలంగాణ సర్కార్ ఆ తర్వాత లాక్ డౌన్ విధించింది. కేసులు పెరుగుతుండటం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని హైకోర్టు సీరియస్ అవ్వడంతో లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకుంది. ఈరోజు వరకూ ఉదయం ఆరు నుంచి పది వరకూ మాత్రమే మినహాయింపు ఇచ్చారు. రేపటి నుంచి మరో మూడు గంటలు మినహాయింపు సమయాన్ని పెంచాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here