Home News Politics

తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్సే నా ?

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో సెమిఫైనల్ పోరు అంటూ దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.ఒక పక్క నేతల ప్రచారంతో హాడవిడి మొదలైతే మరోపక్క జాతీయా న్యూస్ చానల్స్ ముందస్తు సర్వేలతో మరింత పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అనూహ్యమైన తీర్పును ఇవ్వనున్నట్లు న్యూస్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి…

సీ–వోటర్, ఇండియా టుడే,టైమ్స్‌ నౌ, ఐటీటెక్‌ గ్రూప్‌, వీడీఏ అసోసియేట్స్,ఎన్ డీ టీవీ పేరిట గత నాలుగురోజుల్లోనే లెక్కకు మిక్కిలి సర్వేలు ముందస్తు ఫలితాలను తేల్చేస్తున్నాయి. ఈ సర్వేల్లో నిన్న ఎన్ డీ టీవీ ప్రసారం చేసిన సర్వేలో మరోసారి తెలంగాణలో గులాబీ జెండా ఎగరనుందని తేల్చేసింది. ద టీమ్‌ ఫ్లాష్, వీడీఏ అసోసియేట్స్‌ అనే రెండు సంస్థలు వేర్వేరుగా జరిపిన సర్వేలను విశ్లేషించిన ఎన్ డీ టీవీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఏకంగా 85 సీట్లు గెలవనుందని, కాంగ్రెస్‌ కేవలం 18 సీట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోనుందని తేల్చింది. ఎంఐఎం 7, బీజేపీ 5, ఇతరులు నాలుగు సీట్లు గెలవొచ్చని తెలిపింది.

మధ్యప్రదేశ్‌ ప్రజలు మరోసారి బీజేపీ ప్రభుత్వానికే పట్టం కడతారని విశ్లేషణలు అంటున్నాయి. ఇక్కడ మొత్తం 230 శాసనసభ నియోజకవర్గాలుండగా సీ–వోటర్, ఐఈటెక్‌ గ్రూప్, టైమ్స్‌ నౌ సంస్థలు నిర్వహించిన సర్వేలను విశ్లేషించిన అనంతరం.. బీజేపీకి 126, కాంగ్రెస్‌కు 97, ఇతరులకు 7 సీట్లు రావొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇక్కడ సీఎం శివారాజ్ సింగ్ చౌహన్ విషయంలో ప్రజలు కొంత పాజిటివ్ గానే ఉన్నారు.

రాజస్థాన్ లో మాత్రం హస్తం హావా బలంగా వీస్తుంది. .ప్రస్తుతం ఇక్కడ కమలం పార్టీ అధికారంలో ఉంది. రాజస్తాన్ లో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్‌ పార్టీ ఈసారి 129 సీట్లు గెలిచి అధికారం చేపడుతుందని తెలిపింది. బీజేపీకి ఇక్కడ 63 సీట్లతోనే సరిపెట్టుకోనుంది, ఇతరులు మరో 8 సీట్లు సాధించవచ్చని తెలిపింది. ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ అధికారం మారడం సాధారణమే.

ఛత్తీస్ గఢ్ లో మాత్రం హోరాహోరి పోరు ఉన్నా హస్తం పార్టీకే కొంత మొగ్గు ఉంది. కాంగ్రెస్‌ అత్యంత స్వల్ప ఆధిక్యంతో గెలవొచ్చని తెలిపింది. ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గాలు 90 కాగా, మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో 47 స్థానాలు సాధించే దిశగా ఉంది కాంగ్రెస్. ఇక్కడ వరుసగా మూడుసార్ల నుంచి అధికారం నిలబెట్టుకుంటున్న రమణ్ సింగ్ ప్రభుత్వం 39 సీట్లకే పరిమితం కానుంది. ఇక్కడ ఇతరులు కీలకమే. ప్రతిపక్షాల ఓట్ల చీలిక పై గంఫెడాశతో ఉంది కమలం పార్టీ.

ఏది ఏమైన సర్వేలే ప్రాతిపాదికగా ఫలితాలను ఇప్పుడే తేల్చేయలేం. ఈ మధ్య వచ్చిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే సర్వేలు బొక్కబోర్లా పడ్డ సందర్భాలు కో కొల్లలు. ముఖ్యంగా తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడ్డ ప్రతిపక్ష పార్టీలు కూడా కారు పార్టీకి గట్టి పోటీనే ఇస్తున్నాయి. మహబూబ్ నగర్,నల్గొండ లోనే అవలీలగా 20 సీట్లు సాధిస్తామన్న లెక్కలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 18 సీట్లకే పరిమితం అవ్వడమనేది కొంత అలోచించదగినదే….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here