తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ ఫీవర్ హై ఓల్టేజ్ లో ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ సర్వేల హడావుడి నడుస్తుంది. ఈ కోవలోనే జాతీయ న్యూస్ ఛానల్ ఆజ్‌తక్, ఇండియా టుడే ఛానల్స్ తెలుగు రాష్ట్రాల్లో నెక్స్ట్ సీఎం ఎవరో తేల్చేశాయి. తెలంగాణ,ఏపీతో పాటు త్వరలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈ సర్వేను నిర్వహించాయి.
ఏపీ రాజకీయాల పై సర్వే నిర్వహించిన ఇండియాటుడే సంస్థ ప్రతిపక్ష వైసీపీనే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని తేల్చిపారేసింది. తాజాగా యాక్సిస్ మై ఇండియాతో కలిసి సర్వే నిర్వహించిన ఇండియా టుడే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కే ఎడ్జ్ ఉందని జగనే సీఎం కాబోతున్నాడని తేల్చి చెప్పి ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది. చంద్రబాబు పాలన పై ప్రజలకు మొహం మొత్తిందని ఏపీలో అధికార మార్పిడి ఖాయమని ఈ సర్వే స్పష్టం చేసింది. సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే జగన్మోహన్రెడ్డికి 43% మంది ఓటేశారు. చంద్రబాబుకు 38%, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు 5% మాత్రమే మద్దతిచ్చారు ప్రజలు. దాదాపు 10,650 మంది నుంచి ఈ శాంపిల్స్ సేకరించినట్లు సదరు సంస్థ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో తిరిగి గులాబీ పార్టీదే అధికారమని ప్రతిపక్షాలు దాని దరిదాపుల్లో లేవని ఇండియా టుడే, ఆజ్‌తక్ చానల్స్ డంకా భజాయించి చెప్పాయి. తెలంగాణకి సంభందించి 7వేల మందిని ఫోన్ ద్వారా తమ అభిప్రాయాలను సేకరించగా 44 శాతం మంది ఓటర్లు కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారని స్పష్టం చేసింది. 16 శాతం మంది కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సీఎం అవుతారని, 15 శాతం మంది బీజేపీ అభ్యర్ధి సీఎం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారని సర్వేలో వ్యక్తమైంది.
ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కు అనుకూలంగా 44%, మోదీకి 33% మద్దతు పలికినట్టు ఈ సర్వే తెలిపింది. అయితే వచ్చే ఎన్నికల్లో ‘ఏపీకి ప్రత్యేకహోదా’ కీలకంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలతో పాటు, మిగతా రాష్ట్రాల్లోనూ ప్రస్తుత ముఖ్యమంత్రులకే ఎక్కువ శాతం ప్రజలు సానుకూలత చూపితే, ఏపీలో మాత్రం సీఎం చంద్రబాబు కన్నా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కు ఎక్కువ మంది మొగ్గు చూపడం ఆసక్తికరంగా ఉంది.
తాజాగా సర్వేల ఫలితాలు కూడా పాజిటివ్ గా రావడంతో గులాబీ,ఫ్యాన్ పార్టీ నేతల్లో ఉత్సాహం ఊపందుకుంటోంది.
వచ్చే ఎన్నికల్లో తమ విక్టరీని ఎవరు అడ్డుకోలేరంటా ఊహా లోకంలో విహరిస్తున్నాయి.