Home News

ఈడబ్ల్యూఎస్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం సై

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రజలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ప్రస్తుత రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే అదనంగా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50శాతం అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం ఈడబ్ల్యూఎస్ తో కలిపి రిజర్వేషన్లు 60శాతానికి పెరగనున్నట్టు వెల్లడించారు.
ఇక ఇదే అంశంపై విధివిధానాలు రూపోందించి తొందరలోనే ఉన్నస్థాయి సమీక్ష నిర్వహించాలని సీఏం ఆదేశించారు. సమీక్ష అనంతరం ఈడబ్ల్యూఎస్ అమలుపై మార్గదర్శకాలు జారీకానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here