Home News Updates

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్ కింద చూడండి:

  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు 360 డిగ్రీల ఫలితాలు ఇచ్చారు.
  • అనేక వాదనలు-చర్చల తరువాత ఫలితాలు ఇచ్చారు.
  • టీఆరెస్ ప్రభుత్వ పనితీరు ప్రజలకు నచ్చే ఫలితాలు ఇచ్చారు.
  • ప్రజలకు ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావుకు నా ఆశీస్సులు

  • ఇలాంటి విజయం లోకల్ బాడీల్లో ఎవ్వరికి దొరకదు.
  • ఎమ్మెల్యే-ఎంపి- స్థానిక సంస్థలు- ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం టీఆరెస్ కు ప్రజలు ఇచ్చారు.

ఎన్నికలు ఆపేందుకు ప్రతిపక్షాలు అనేక ప్రయత్నాలు చేసాయి

ప్రతిపక్షాల నోటికి హద్దులు లేవు

జాతీయ పార్టీకి ప్రజలు మంచి సమాధానం ఇచ్చారు

సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు చేసాయి

సోషల్ మీడియా పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది

సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము

ప్రచారానికి పోకుండా విజయం సాదించాము

మొదటినుంచి క్రమశిక్షణతో ఉన్న పార్టీ టీఆరెస్

నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 10 మంది ఎమ్మెల్యే లతో మాట్లాడను

అధికార దుర్వినియోగం అనేది ఎక్కడ జరగలేదు

వేల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో ప్రతిపక్షాలు చెప్పాలి

మున్సిపల్ ఎన్నికలు ఒక టాస్క్ లాగా తీసుకోని పనిచేసాము

లోకల్ లెవల్ లో కష్టపడ్డాము

టీఆరెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 80 లక్షల నుంచి కోటి వరకు పార్టీ మెటీరియల్ పంపాము అంతే

కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం ప్రకారమే మున్సిపోల్స్ గెలిచాము

ప్రజాస్వామ్యంలో విలువలతో రాజకీయాలు చేయాలి

నాకున్న అనుభవంలో ఇలాంటి విజయం ఎప్పుడూ చూడలేదు

ఈ విజయం మా భాధ్యతను మరింత పెంచింది

గెలిచినంత మాత్రాన టీఆరెస్ నేతలకు ఎవ్వరికి గర్వం అవసరం లేదు

త్వరలో గెలిచిన నేతలకు పట్టణ ప్రగతి కోసం శిక్షణ తరగతులు

పోలీస్ నిర్బంధ సిటీలో దేశంలో డిల్లీ మొదటి స్థానంలో ఉంది

హైదరాబాద్ లో ఇక్కడ స్థానిక ప్రజలతో పాటు ఏటా ఐదారు లక్షల ప్రజలు వస్తున్నారు

భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఛాలెంజ్ రాబోతుంది

అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం 20 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నాము

57 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి వృద్ధ్యప పెన్షన్ ఫిబ్రవరి తరువాత ఇస్తాం

ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని త్వరలోనే పెంచుతాము

కేంద్రం సరిగ్గా పనిచేయడం లేదు

తెలంగాణకు 5వేల కోట్ల బకాయిలు కేంద్రం నుంచి రావాలి

ఇంకా 1131 కోట్లు జిఎస్టీ కింద రావాల్సి ఉంది

త్వరలో ఉద్యోగులతో సమావేశం ఉంటుంది

పీఆర్సీ పెంచాలి కాబట్టి కచ్చితంగా ఎంతో కొంత పెంచుతాము

గత ఐదేళ్ల క్రితం కాగ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి ఏటా 21శాతం జీడీపీ వృద్ధి ఉండేది.

ఈ ఏడాది 9.5 గ్రోత్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కోసం కార్యాచరణ ప్రారంభిస్తాం

గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తాం

త్వరలో నేను గల్ఫ్ పర్యటనకు వెళ్తాము

15 మంది ఎమ్మెల్యేలతో కలిసి గల్ఫ్ పర్యటన కు వెళ్తాము
తెలంగాణ రాష్ట్రంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది

కాంగ్రెస్-టీడీపీ తెలంగాణ కు నిరక్షరాస్యత మాత్రమే ఇచ్చింది

న్యూ రెవెన్యూ చట్టం త్వరలో తెస్తాం..పార్లమెంట్ సెషన్స్ లో ఏర్పాటు

రెవెన్యూ శాఖకు తప్పకుండా సర్జరీ అవసరం

పటిష్టమైన రెవెన్యూ చట్టం తెస్తాం…రెవెన్యూ ఉద్యోగులు..అపోహలు నమ్మొద్దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here