Home Videos

తెలంగాణా కేబినెట్ ప్రక్షాళనలో పదవీగండం తప్పదా?

దుబ్బాక ఫలితం టీఆర్‌ఎస్‌ ధీమాను దెబ్బకొట్టింది. ప్రత్యర్థులకు డిపాజిట్లు రావనుకున్నచోట కారు బోల్తాకొట్టింది. తేడా ఎంతన్నదికాదు…బీజేపీ బుల్లెట్‌ దిగింది. స్వయానా సీఎం సొంత జిల్లాలో, అది కూడా ఆయన మేనల్లుడు, సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి హరీష్‌ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన చోట ఓడిపోవడం…టీఆరెస్‌కి రాజకీయంగా పెద్ద షాక్‌.

ఇప్పటిదాకా తెలంగాణలో తమకు తిరుగులేదన్న నమ్మకంతో ఉన్న గులాబీపార్టీ దుబ్బాక రిజల్ట్‌ తో ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. లోతుగా సమీక్షించుకునేందుకు రెడీ అవుతూనే…ప్రక్షాళన చర్యలకు పూనుకుంటున్నారు టీఆరెస్‌ అధినేత కేసీఆర్. తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపట్టాలనుకుంటున్నారు కేసీఆర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here