Home News Politics

కేబినెట్ మహిళామంత్రుల్లో విపక్ష ఎమ్మెల్యే కి చాన్సుందా….!

తెలంగాణ రాష్ట్ర తొలి క్యాబినెట్లో మహిళలకు చోటు దక్కలేదు .. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా గులాబీబాస్‌ తనదైన మార్క్‌తో పాలన సాగించి రెండో సారి పవర్‌లోకి వచ్చారు.. ఇప్పుడు కూడా క్యాబినెట్‌ ఏర్పడినా లేడీ ఎమ్మెల్యేలకు ఛాన్స్‌ దక్కలేదు.. అయితే వచ్చే విస్తరణలో ఇద్దరు మహిళ మంత్రులు ఉంటారు అని సీఎం చేసిన కామెంట్లు అధికార పార్టీతో పాటు కాంగ్రెస్‌లో సైతం హాట్‌టాపిక్‌గా మారాయి .. అసలు మహిళా మంత్రుల పై అధికార విపక్ష పార్టీల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణ తొలి ప్రభుత్వంలో మహిళా మంత్రుల ప్రాతినిధ్యం లేకుండానే పాలన ముగిసింది… కేబినెట్లో మహిళలు లేరని ఎన్ని విమర్శలు వచ్చినా .. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనదైన మార్క్‌తో వాటిని తిప్పి కొడుతూ పాలన సాగించారు .. తిరిగి ఆయనే ముందస్తు ఎన్నికల్లో కూడా బంపర్‌ విక్టరీ సాధించారు .. ముందుగా మహముద్‌ఆలీతో కలిసి ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. దాదాపు రెండు నెలల తర్వాత కేబినెట్‌ను విస్తరించి మరో పదిమందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.. అయితే ఆ విస్తరణలో కూడా మహిళా ఎమ్మెల్యేలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లభించలేదు … టీఆర్‌ఎస్‌ తరపున ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు గెలుపొందినా వారికి ఛాన్స్‌ దక్కలేదు..

ఆ క్రమంలో అసెంబ్లీ సెషన్స్‌లో బడ్జెట్ పై చర్చ సందర్బంగా… మాజీ మంత్రి , కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… కనీసం మహిళలకు కేబినెట్లో ప్రాధాన్యత అయినా ఇవ్వండి అని అడిగారు… దానిపై స్పందించిన సీఎం కేసీఆర్ మీకు అనుమానం వద్దు .. తర్వాత విస్తరణలో ఇద్దరు మహిళల్ని మంత్రుల్ని చేయనున్నట్లు ప్రకటించారు… ఇది టిఆర్‌ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యే లకు తీపి కబురే..! అయితే ఆ స్టేట్‌మెంట్‌ కాంగ్రెస్‌ ముఖ్యుల్లో అనుమానాలు రేకెత్తిస్తూ .. చర్చనీయాంశంమైంది..

సీఎం చెప్పిన ఇద్దరు మహిళ మంత్రుల్లో ఉండేది ఏ పార్టీ వారన్న చర్చ అటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో జరుగుతోంది … అటు అధికార పక్షంలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలతో పాటు, ఒకరు ఎమ్మెల్సీ ఎంపిక కానున్నారు… ఆ నలుగురిలో ఇద్దరికి కేబినెట్‌ బెర్త్‌లు దక్కుతాయా? లేకపోతే కాంగ్రెస్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి మినిస్ట్రీ ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది ..

కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో … సబితా ఇంద్రారెడ్డి, సీతక్క లు సీనియర్లు… వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని.. సీఎం తన పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇస్తారేమో అన్న గుబులు ఆ పార్టీలో కనిపిస్తోంది.. అదలా ఉంటే టిఆర్‌ఎస్‌లో ఉన్న మహిళా ఎమ్మెల్యేలకు తాము అడిగి పదవులు దక్కేలా చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు సబిత .. మరోవైపు పార్టీ నేతలతో సీతక్క మాట్లాడుతూ.. టిఆర్‌ఎస్‌ కేబినెట్‌లో ఇద్దరు మహిళలు ఉంటారంట.. అది మేము కాదులే అని వ్యాఖ్యానిస్తున్నారు .. దాని పై అక్కడే ఉన్న కాంగ్రెస్‌ ముఖ్యనేత ఒకరు .. సీతక్క సెంట్రల్ మినిస్టర్ట్ అవ్వడం ఖాయమంటున్నారు .. దాంతో మళ్ళీ మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌ కాంగ్రెస్‌ టికెట్‌ సీతక్కకే అన్న సంకేతాలిచ్చిట్లు అయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది …

సహజంగా సీఎం మంత్రి పదవుల ప్రస్తావన చేస్తే… దానిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలలో చర్చ జరగాలి… అయితే ఇక్కడ సీన్ రివర్సైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య కేబినెట్ చర్చ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది… దాంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై తిరిగి ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగిస్తున్నారన్న చర్చ ఊపందుకుంది… మరి చూడాలి టిఆర్‌ఎస్‌ కేబినెట్లో మహిళా మంత్రుల కూర్పు ఎలా ఉంటుందో ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here